South Africa Record Highest Run Chase In T20I: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సౌతాఫ్రికా జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఏకంగా 259 పరుగుల లక్ష్యాన్ని చేధించి, అత్యధిక టార్గెట్‌ను ఛేజ్ చేసిన జట్టుగా వరల్డ్ రికార్డ్ నమోదు చేసింది. సూపర్‌స్పోర్ట్ పార్క్ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగ్గా.. ఇరు జట్లు పరుగుల వర్షాన్ని కురిపించాయి. మొబైల్‌లో ఈఏ స్పోర్ట్ ఆడుతున్నట్టు.. మైదానంలో ఎడాపెడా బౌండరీలు బాదేశారు. తొలుత వెస్టిండీస్ జట్టు 258 పరుగులు చేస్తే.. తామూ ఏం తక్కువ తినలేదన్నట్టుగా సౌతాఫ్రికా ఆటగాళ్లు రెచ్చిపోయి, ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించేశారు.
Nandigam Suresh: జగన్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఎవ్వరికీ సాధ్యం కాదు
మొదట టాస్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు వెస్టిండీస్ రంగంలోకి దిగింది. మైదానంలో అడుగుపెట్టిన కొన్ని సెకన్లలోనే వెస్టిండీస్ జట్టుకి దెబ్బ తగిలింది. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కానీ.. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలైంది. కైల్ మేయర్స్ (57), జాన్సన్ చార్ల్స్ (118) కలిసి సౌతాఫ్రికా బౌలర్లపై తాండవం చేశారు. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని, ఫోర్లు & సిక్సులుగా మలిచారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయారు. వీళ్లిద్దరు మైదానంలో ఉన్నంతసేపు.. ఒకటే దంచుడు. ముఖ్యంగా చార్ల్స్ అయితే పూనకం వచ్చినట్టు.. ఒకటే బాదుడు బాదేశాడు. 39 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడంటే, అతడు ఏ రేంజ్‌లో విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. చివర్లో వచ్చిన షెఫర్డ్ (41) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో.. వెస్టిండీస్ నిర్దిష్ట 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఇక సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్ 3, వేన్ పార్నెల్ 2 వికెట్లు తీశారు.
K Raghavendra Rao: దర్శకేంద్రుడికి అరుదైన గౌరవం.. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్
అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 18.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి ఆ లక్ష్యాన్ని చేధించి, అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100) శతక్కొట్టగా.. రీజా హెండ్రిక్స్ (68) సైతం శివమెత్తినట్టు ఆడాడు. వీళ్లిద్దరి విధ్వంసం కారణంగా.. 10.5 ఓవర్లోనే సౌతాఫ్రికా జట్టు 152 పరుగులు చేసేసింది. వెస్టిండీస్ బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ.. వీళ్లు పరుగుల సునామీ సృష్టించారు. చివర్లో కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (38 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (16 నాటౌట్) జట్టును గెలుపుతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో హోల్డర్, స్మిత్, రీఫర్, పావెల్ తలా వికెట్ తీశారు. టీ20 చరిత్రలో ఇదే హయ్యస్ట్ ఛేజింగ్. ఇంతకుముందు 2018లో ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్‌పై 245 పరుగులు చేసి విజయం సాధించగా.. ఆ రికార్డ్‌ని సౌతాఫ్రికా తాజా మ్యాచ్‌తో బ్రేక్ చేసేసింది.