Peddapalli: ఇవాళ పెద్దపల్లి జిల్లాలో మంత్రుల బృందం పర్యటించనున్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా మంత్రుల బృందం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం ఓదెల మండలం కొలనూరు గ్రామానికి హెలికాప్టర్‌లో మంత్రుల బృందం చేరుకోనున్నారు.
Read also: Heavy Rains: తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. రాగల 24 గంటల్లో భారీ వర్షాలు..
ఓదెల-కొలనూరు మధ్య నిర్మించిన రోడ్డును, కొలనూరు గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించనుంది. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాటుపల్లి గ్రామంలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి మంత్రుల బృందం శంకుస్థాపన, రెడ్డిగార్డెన్స్‌లో ఆయిల్‌పామ్ రైతులతో మంత్రుల బృందం సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రైతు భరోసా సభకు హాజరయ్యేందుకు మంత్రుల బృందం కరీంనగర్ బయలుదేరుతుంది. జిల్లాలో మంత్రుల బృందం పర్యటన దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Air India: ఢిల్లీ నుంచి యూఎస్ వెళ్తున్న విమానం రష్యాలో ల్యాండ్.. కారణం చెప్పిన ఎయిర్ ఇండియా..?