Bandisanjay Arrested: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను జనగామలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ పాత్రపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ప్రజాసంగ్రామయాత్రలోభాగంగా.. స్టేషన్ ఘన్ పూర్ లో బసచేసిన చోటే దీక్షకు రెడీ అయిన బండి సంజయ్ ను భగ్నం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్ పై బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీ నాయకులపై దాడులను నిరసనగా ఆందోళనకు పిలుపు నిచ్చారు. బండిసంజయ్. తమ నాయకులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు.ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద కొందరు బీజేపీ నేతలు భాజపా నాయకులు నిరసన చేపట్టిన వారిని పోలీసులు అదుపులో తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. దీంతో బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బీజేపీ శ్రేణులు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే హత్యాయత్నం కేసులు పెడతారా అని నిలదీశారు. తమ నేతలపై వారే దాడులు చేసి బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దాడి చేయడంతో.. బీజేపీ నేతలకు గాయాలవడంతో.. వారిని ఆసుపత్రికి తరలించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. ఒక లిక్కర్ స్కామ్ పై నిజాలు తేల్చెంత వరకు ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ మద్యం పాలసీ తెలుగు రాష్ట్రాల్లో సంచలంగా మారింది.
AP Cabinet Meeting: ఈనెల 29న ఏపీ కేబినెట్ సమావేశం.. ప్రతిపాదనలు పంపాలని సీఎస్ ఉత్తర్వులు