నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా: బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్ధిపేటలోని రంగదాంపల్లి వద్ద కార్యకర్తలను కలిసి వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రముఖ్యమంత్రి నేతృత్వంలో పోలీసులు దాడి చేసిన తీరును దేశం మొత్తం చూసిందన్నారు. నీకు వత్తాసు పలికితే కేసులు లేవు.. లేదంటే కేసులు పెట్టి బెదిరిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. రాష్ర్టంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. నా కార్యాలయంలో దాడులు చేసి, ధ్వంసం చేశారు. నా కార్యాలయంలో ఫైల్స్‌ను అన్నింటిని నాశనం చేశారు. 317 జీవో రద్దు చేయాలి, నిన్ను ఫామ్ హౌస్ పడుకోవడానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదని..ప్రజల సమస్యలను తీర్చడానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని కేసీఆర్‌పై బండి సంజయ్ మండిపడ్డారు.
Read Also:హెరిటేజ్‌లో రేట్ల కన్నా మార్కెట్ రేట్ తక్కువగా ఉంది: కొడాలి నాని
Also Read
ఉద్యోగుల ఆరోగ్యం పాడవ్వకముందే ఈ జీవోకు సవరణ చేయాలన్నారు.యు ట్యూబ్ విలేకరులపైన కేసులు పెడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. నిన్ను, నీ కొడుకును ఎట్టి పరిస్థితుల్లో వదలం..నీ కొడుకు మైండ్ కరాబు అయిందంటూ కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.ఈ సమస్యను ఇంకా జటిలం చేయాలని చూడొద్దన్నారు. ఉద్యోగుల ఇప్పుడు పోరాటం చేయండి, మీరు చేయకపోతే మీరే నష్ట పోతారు, మీ వెంట మేము, బీజేపీ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఉద్యోగులను, ఉద్యోగ సంఘాలు చీల్చి పరిపాలన చేస్తున్నాడని దుయ్యబట్టారు. నిరుద్యోగ సమస్య మీద పోరాడుదాం.. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తెలుసా అంటూ కేసీఆర్‌ను విమర్శించారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి నీ ప్రజలు పరిగెత్తిస్తారని బండి సంజయ్ చెప్పారు.
తాజావార్తలు
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!