Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitesh Tiwari: రణ్‌బీర్ కపూర్ రాముడిగా, రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్న భారీ చిత్రం ‘రామాయణ’. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమా గురించి దర్శకుడు నితీష్ తివారీ ఒక అదిరిపోయే విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో వచ్చే కేవలం ఒక్క ఫైట్ సీన్ కోసమే తాము ఏకంగా ఆరున్నరేళ్లు కష్టపడ్డామని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘రామాయణ’లో రావణుడు, జటాయువు మధ్య జరిగే ఆకాశంలో జరిగే పోరాటం చాలా ముఖ్యమైనదని గుర్తుచేశారు. ఈ ఒక్క సీక్వెన్స్ చేయడానికి తమకు దాదాపు ఆరున్నరేళ్లు పట్టిందని చెప్పారు.
ఈ ఫైట్ సీన్ అనుకున్న విధంగా స్క్రీన్‌పై తీసుకురావడానికి వేలాది మంది గ్రాఫిక్స్ కళాకారులు రాత్రింబవళ్లు పనిచేసినట్లు నితీష్ తెలిపారు. “సినిమా నుంచి ఏదైనా క్లిప్ రాగానే చాలామంది చాలా తేలిగ్గా.. ఇదంతా కంప్యూటర్ పని, ఏఐ చేసిందిలే అని అనేస్తుంటారు. కానీ ఆ ఒక్క ఫ్రేమ్ పర్ఫెక్ట్గా రావడం వెనుక వేల మంది మనుషుల నిరంతర శ్రమ దాగి ఉంది” అని ఆయన చెప్పుకొచ్చారు. రావణాసురుడి పుష్పక విమానం డిజైన్‌ను ఫైనల్ చేయడానికే సుమారు రెండేళ్లు పట్టిందని, విమానం తీరు మారిన ప్రతిసారీ ఈ ఫైట్ సీన్‌ను మళ్లీ మళ్లీ మార్చుకుంటూ రావాల్సి వచ్చిందని అన్నారు. ఇంతవరకు ఏ సినిమాలోనూ చూడని విధంగా ఈ సీన్ ఉంటుందని, థియేటర్లలో చూసినప్పుడు ఆడియన్స్‌కు గూస్బంప్స్ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!