Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gambling Raid: పేకాట క్లబ్బులను ప్రభుత్వం మూసివేయడంతో ఇప్పుడు ఫామ్ హౌస్ లు అడ్డాగా పేకాట నడుస్తుంది ..ఎక్కడెక్కడ రీస్టార్ట్ లతోపాటు ఫామ్ హౌస్‌లలో పేకాట పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు అధికారులకు సమాచారం వస్తుంది. ఏకంగా హైదరాబాద్ నగరంలోని వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి పేకాట ఆడుతున్నట్లు అధికారుల విషయంలో బయటపడింది .దీంతో ప్రముఖ వ్యాపారవేత్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో జూదమాడుతున్న 27 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వట్టినాగులపల్లిలోని ‘ది స్కై బై విహారా’ ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు రహస్యంగా ‘అందర్-బహార్’ పేకాట ఆడుతున్నట్లు గచ్చిబౌలి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌పై మెరుపు దాడి నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతూ పట్టుబడిన 27 మందిని అదుపులోకి తీసుకుని, పందెం కాస్తున్న రూ.10 లక్షల నగదును సీజ్ చేశారు. బీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన చిన్న యాదవ్, సన్‌సిటీకి చెందిన సోను, అలాగే నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి గత నాలుగు నెలలుగా ఈ ఫామ్‌హౌస్‌లో పేకాట క్లబ్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ స్థావరంలో ప్రతిరోజూ సుమారు రూ.20 లక్షల మేర నగదు లావాదేవీలు జరుగుతున్నట్లు సమాచారం. నగరంలోని పలు ప్రాంతాల నుంచి జూదరులను రప్పించి పెద్ద ఎత్తున ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించారు. నిందితులపై గచ్చిబౌలి పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిర్వాహకుల పాత్రతో పాటు, ఫామ్‌హౌస్ యాజమాన్యం ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నారు.
Also Read
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం... అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
- Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
-
Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
-
Korivi Movie: మాయా నది ఒడ్డున గుప్త నిధి.. కాపలాగా ‘కొరివి’ దెయ్యం!
-
Wife Kills Husband : కొత్తపేటలో దారుణం… భార్య చేతిలో భర్త దారుణ హత్య!
-
Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!