Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arjuna: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబోలో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు ఫిలింనగర్లో ఓ క్రేజీ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుండటంతో పాటు, ఈసారి ఏకంగా పాన్-ఇండియా రేంజ్లో పూర్తిస్థాయి మాస్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారనే టాక్ బయటికి రావడంతో అభిమానుల్లో విపరీతంగా అంచనాలు పెంచేస్తోంది
ఈ చిత్రానికి సంబంధించి ఫిల్మ్ చాంబర్ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు ఇప్పటికే ‘అర్జున’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని చిత్ర బృందం భావిస్తోందట. మహాభారతంలోని అర్జునుడి లాగే.. ఇందులో హీరో క్యారెక్టర్ కూడా బలమైన లక్ష్యంతో ఉండే ఓ అసాధారణ పోరాట యోధుడిలా కనిపిస్తుందని, అందుకే ఈ పేరును పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Also Read
ప్రస్తుతం దిల్ రాజు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పనులు ముగిసిన వెంటనే పవన్ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తుండగా, కథకు సంబంధించిన తుది సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా భారీ బడ్జెట్‌తో ఈ యాక్షన్ డ్రామాను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం పాలిటిక్స్‌తో బిజీగా ఉండటంతో, ఆయన షెడ్యూల్స్ క్లియర్ అయిన వెంటనే చిత్ర యూనిట్ నుంచి ఈ ‘అర్జున’ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా, పవర్ స్టార్‌కి ‘అర్జున’ అనే టైటిల్ ఖరారైతే మాత్రం థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అఫిషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
-
DG Charu Sinha: మహిళల భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!