తెలంగాణలో బీజేపీ తన అస్థిత్వం కోసం పోరాటం చేస్తోంది. 2023 టార్గెట్ గా పావులు కదుపుతోంది. వచ్చిన అవకాశాలను దేన్నీ వదలడం లేదు. సీఎం కేసీఆర్ పై పోరాటానికి దిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి, రాజ్యాంగాన్ని మార్చాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమవుతున్నాయి. అంతేకాదు ప్రధాని మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు మండిపడుతున్నారు.…