Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతుంది
- జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎస్సార్ నిధులతో ఆధునిక పరికరాలు
- ఆరోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు
- చెక్ డ్యాంల అవినీతి పై పూర్తి స్థాయి విచారణకు డిమాండ్
- రైల్వే స్టేషన్ అప్గ్రేడ్-స్టేడియం నిర్మాణానికి బండి సంజయ్ హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలు అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులను విశ్వసించి వస్తారని, ఆ నమ్మకాన్ని పెంపొందించే దిశలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బండి సంజయ్ తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ అవకాశాలను సక్రమంగా వినియోగించుకోలేకపోతుందని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక పేదలకు నమ్మకం తగ్గిపోతున్నదని, ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటివరకు సిఎస్సార్ నిధుల ద్వారా ఐదు కోట్ల రూపాయలు అందజేసి ఆధునిక పరికరాలను తీసుకురావడంలో విజయవంతమయ్యామని చెప్పారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం రూమ్, ఎక్స్–రే మిషన్తో పాటు అవసరమైన ఇతర పరికరాలను ఎంపీ నిధుల ద్వారా త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. పరికరాల లేమి పేరుతో పేద రోగులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేయొద్దని వైద్యులకు సూచించారు.
Also Read
సేవా దృక్పథంతో పనిచేస్తే ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై మంచి విశ్వాసం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని చెక్డ్యాంల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల వద్ద నుంచి కమీషన్లు తీసుకుందని, ప్రణాళిక లేకుండా చెక్డ్యాంలను నిర్మించారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారని అన్నారు.
చెక్డ్యాంలపై విచారణ జరిపించి అవినీతి నిర్ధారణ అయితే కాంట్రాక్టర్ల నుంచి నిధులు రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ను పూర్తిగా ఆధునీకరించేందుకు త్వరలో ప్రపోజల్స్ పంపుతామని, జమ్మికుంటలో స్టేడియం నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.
తాజావార్తలు
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్కు బిగ్ రిలీఫ్..
-
Pulivendula Chicken Centre Fire: పులివెందులలో చికెన్ సెంటర్కు నిప్పు.. ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
-
AP High Court: స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?