కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోటి యాభై లక్షల రూపాయల సిఎస్సార్ నిధులతో కొనుగోలు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య. తన పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలతో పాటు, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిపై చర్చించారు బాలయ్య. పార్లమెంట్‌కు వెళ్లిన బాలకృష్ణ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. నటుడిగానే కాదు ప్రజాప్రతినిధిగా తన సేవా ప్రయాణం, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతపై బాలకృష్ణ, స్పీకర్ ఓం బిర్లాకు వివరించారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవల…
నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఖాజగూడ చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. నెక్నాంపూర్ లోని ఇబ్రహీంబాగ్ చెరువు సుందరీకరణ పనులు స్పీడప్ చేయాలని దత్తత తీసుకున్న సంస్థను కోరారు.
థర్డ్ పార్టీ ఫండ్ (టీపీఎఫ్) పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసానికి పాల్పడుతున్నారు. రూ.12 లక్షలు కడితే సంవత్సరానికి 36 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమవుతుందంటూ బాధితులకు నమ్మబలికారు. తీరా డబ్బుల గురించి అడిగితే మాయమాటలు చెబుతున్నారు. ఈ క్రమంలో మోసపోయామాని తెలుసుకున్న కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.