నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నా విషయం తెలిసిందే.. అయితే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు ఆదివారం జరిగే బహిరంగ సభలోను ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంతో రాష్ట్రానికి వస్తున్న ప్రధానికి స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ వెళ్లడం లేదు.. ఆయకు బదులుగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరించనున్న విషయం తెలిసిందే. దీనిపై తలసాని తనే వెళ్లనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే దీనిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
read also: Uttar Pradesh: మహిళపై సామూహిక లైంగిక దాడి.. గర్భస్రావం
మోడీకి స్వాగతం పలకకుండా సీఎం కేసీఆర్ దూరంగా ఉండటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కాగా.. ఫిబ్రవరిలో మోడీ నగరానికొస్తే జ్వరమని ఫార్మ్ హౌస్ల పన్నవ్.. మొన్న హైదరాబాద్ వస్తే పక్కరాష్ట్రానికి జారుకున్నవ్.. ఈసారి 2రోజులు మోడీ గారు ఇక్కడనే ఉంటున్నాడు. మరి ఊర్లనే ఉంటవా? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా? నీ మేకపోతు గాంభీర్యాలు బరాబర్ బయటపెడతము అంటూ బండిసంజ్ ట్వీట్ చేశారు.
ఫిబ్రవరిలో మోడీగారు నగరానికొస్తే జ్వరమని ఫార్మ్ హౌస్ల పన్నవ్
మొన్న హైదరాబాద్ వస్తే పక్కరాష్ట్రానికి జారుకున్నవ్
ఈసారి 2రోజులు ఇక్కడనే ఉంటున్నాడు మోడీగారు.
ఊర్లనే ఉంటవా ? ఊర్లు పట్టుకొని తిరుగుతవా దొరా?
నీ మేకపోతుగాంభీర్యాలు బరాబర్ బయటపెడతము.#SaaluDoraSelavuDora— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 2, 2022