సీఎం కేసీఆర్ ఈ రోజు వనపర్తి జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 10 గంటలకు సంచలన ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. నిరుద్యోగులారా…. తస్మాత్ జాగ్రత్త, అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ మరోసారి మోసం చేయబోతున్నాడు అంటూ వ్యాఖ్యానించారు. లక్షా 91 వేల ఉద్యోగాలిచ్చేదాకా వదలిపెట్టే ప్రసక్తే లేదని, బకాయిలతో సహా నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. పదివేలో, 20 వేలో ప్రకటించి చేతులు దులుపుకుంటానంటే ఊకునేది లేదని, 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇయ్యాల్సిందేనన్నారు.
అదేదో గొప్పగ చెబుతున్నవ్? నీ ఇంట్లకెళ్లి ఇస్తున్నవా? అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఈ 8 ఏళ్లలో ఎంతమంది నిరుద్యోగులను బలి తీసుకున్నవ్? కాషాయ జెండాను, బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతవా? నీకా దమ్ముందా? దేశంలో పచ్చ జెండా ఎంఐఎం ఎజెండాను విస్తరింపజేయడానికి ప్రణాళిక చేస్తున్నవా? అంటూ ఆయన మండిపడ్డారు. నీలాంటి కొన్ని వందల మంది బీజేపీని కనుమరుగు చేద్దామని రహస్య ఎజెండాను అమలు చేసి తీరా ఏమీ చేయలేక కనుమరుగైపోయారని ఆయన అన్నారు.