One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్‌పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్‌లల్లో ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరిస్తూ ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీసేవ ఆధ్వర్యంలో వినూత్నంగా ‘మీటికెట్’ (MeeTicket) యాప్‌ను టీజీఎస్ ఆర్టీసీ రూపొందిస్తోంది. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ అభివృద్ధి చెందుతోంది. దీనిద్వారా ఆర్టీసీ, మెట్రో, ఆటోలు, క్యాబ్స్ వంటి అన్ని ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకే డిజిటల్ వేదికపైకి అనుసంధానమవుతాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణికుడు ఒకే చోట ఆర్టీసీ లేదా మెట్రో టికెట్‌తో పాటు, తన గమ్యస్థానానికి తగినట్లుగా ఆటో లేదా క్యాబ్‌ను కూడా ముందస్తుగా బుక్ చేసుకునే వీలుంటుంది. వినియోగదారుడు తనకు కావలసిన రవాణా విధానాన్ని ఎంచుకుని, ఒకే టికెట్ ద్వారా సమగ్రమైన ప్రయాణ అనుభవాన్ని పొందేందుకు ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది.
ఈ ‘మీటికెట్’ యాప్ ఒక ఉమ్మడి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. దీని ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లతో పాటు ఇతర రవాణాదారులు భాగస్వాములుగా చేరి, ప్రయాణికులకు నేరుగా సేవలు అందించి లబ్ధి పొందవచ్చు. ఇందులో చెల్లింపుల ప్రక్రియను కూడా చాలా సులభతరం చేశారు. ప్రయాణికులు చెల్లించిన రుసుమును ఆయా రవాణా విభాగాలు, భాగస్వాములకు ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా జమ చేసే ఆధునిక చెల్లింపుల వ్యవస్థ ఇందులో అందుబాటులో ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడంతో పాటు రవాణా భాగస్వాములకు కూడా లావాదేవీల ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుంది.
Also Read
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
మరోవైపు “ఆర్టీసీ సొంతంగా ఆటోలను కొనుగోలు చేసి నడుపుతుంది” అని ఇటీవల సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో జరుగుతున్న ప్రచారాలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టతనిచ్చింది. ఆర్టీసీ స్వయంగా ఆటోలను కొనుగోలు చేయడం కానీ, వాటిని నిర్వహించడం కానీ చేయదని, భవిష్యత్తులో కూడా అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని యాజమాన్యం కోరింది. ‘మీటికెట్’ యాప్ ద్వారా కేవలం సేవలను అనుసంధానించడం తప్ప, ఆటోలను సొంతంగా నడిపే ఆలోచన లేదని తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!