మత్స్యకారులు సామరస్యంతో ఉండాలి: మంత్రి అప్పలరాజు

విశాఖలో చోటు చేసుకున్న మత్స్యకారులు వాగ్వాదానికి సంబంధించి మంత్రుల సమావేశం ముగిసింది. ఈసందర్భంగా ఏపీ మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. అనుమతి ఉన్న 11 రింగు వలల బోట్లలో మూడింటికే ట్రాన్స్ ఫా౦డర్స్ ఉన్నాయి. వాటితో 8కిలోమీటర్ల తరువాత వేట కొనసాగించవచ్చని తెలిపారు. మిగిలిన 8 రింగు వలల బోట్లు ట్రాన్స్‌ఫాండర్స్‌ ఏర్పాటు చేసుకుని వెళ్లొచ్చిని తెలిపారు. రింగు వలల వివాదం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉందని, మత్స్యకారులు సామరస్యంతో ఉండాలని మంత్రి అన్నారు.

Read Also: ఈనెల 10న రాష్ట్ర బంద్‌కు బీజేపీ పిలుపు

లైసెన్స్ లేని రింగ్ వలలకి సంబంధించి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే చట్టపరిధిలో సానుకూలంగా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. రింగు వలల వివాదం వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని వారి ప్రోద్భలంతోనే ఈ వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తున్నారని మంత్రి అన్నారు. సున్నితమైన అంశంపై కొందరూ అనవసర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మత్స్యకారులు ఇప్పటికైనా సామరస్యంతో వేటను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరమైన భేషజాలకు పోయి వివాదాలు తెచ్చుకోవద్దని మత్స్యకారులకు మంత్రి సూచించారు.

Related Articles

Latest Articles