టీచర్ల విషయంలో సీఎం కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. తల్లులను, పిల్లలను వేరు చేసి అరెస్ట్ చేస్తారా? ఓట్లు, సీట్ల రాజకీయం తప్ప మనవ సంబంధాలు, భావోద్వేగాలు పట్టవా?మానవత్వం లేని మృగానివి. వినాశకాలే విపరీతబుద్ధి. ప్రజాస్వామ్యవాదులారా…. స్పందించండి. అసలు టీచర్లు చేసిన తప్పేంటి?… భార్యభర్తలు ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించాలనడమే నేరమా? తక్షణమే భేషరతుగా టీచర్లను విడుదల చేయాలి. 317 జీవో సవరణపై ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలి.
Read Also: Kartik Aryan: లాక్‌డౌన్‌లో రోజుకు 2 కోట్లు తీసుకొని.. ఆ పని చేశా
బీజేపీ అధికారంలోకి రాగానే 317 జీవోను సవరిస్తాం. 317 జీవోను సవరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్దంగా గత రెండ్రోజులుగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులపట్ల పోలీసుల అనుసరించిన వైఖరి అత్యంత అమానుషం. మహిళలు, పసిపిల్లలని కూడా చూడకుండా వేరు చేయడం దుర్మార్గం. చంటిపిల్లలు ఏడుస్తున్నా తల్లిని, పిల్లలను వేరు చేస్తూ ఈడ్చుకుంటూ అరెస్ట్ చేయడం సిగ్గు చేటు. టీచర్లను అరెస్ట్ చేస్తున్న తీరును చూసి సభ్యసమాజం అసహ్యించుకుంటోంది.ముఖ్యమంత్రి కేసీఆర్ కు మానవత్వం లేదని మరోసారి రుజువైంది. పిల్లలతో కలిసి టీచర్ల కుటుంబాలు నడిరోడ్లపై ధర్నాలు, ఆందోళన చేస్తున్నా, పసిపిల్లలు భోరున ఏడుస్తున్నా మనుసు కరగడం లేదు. నిత్యం ఓట్లు, సీట్ల, డబ్బు రాజకీయాలే తప్ప భావోద్వేగాలు, మానవ సంబంధాలు పట్టని మానవ మ్రుగం.
అసలు టీచర్లు చేసిన తప్పేంటి? పిల్లలతో కలిసి భార్యాభర్తలకు ఓకే చోట పనిచేసే అవకాశం కల్పించడం నేరమా? కనీసం ఈ అంశంపై వారితో చర్చించాలనే ఆలోచన కూడా చేయకపోవడం సిగ్గు చేటు అన్నారు. 317 జీవోను సవరించాలని కోరుతూ గత ఏడాది ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న నన్ను, నాతోపాటు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన అప్రజాస్వామికంగా వ్యవహరించిన తీరు ఈ సందర్భంగా గుర్తుకొస్తోంది.భార్యను ఒక దగ్గర, భర్తను మరోచోట బదిలీ చేయడం అన్యాయం. రెండేళ్లు కావొస్తున్నా సమస్యను పరిష్కరించకుండా అమానుషంగా వ్యవహరించడం దారుణం. కేసీఆర్ సర్కార్ కు పోయే కాలం దాపురించింది. వినాశకాలే విపరీత బుద్ధి అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి.తక్షణమే అరెస్ట్ చేసిన టీచర్లందరినీ భేషరతుగా విడుదల చేయాలి. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేనిపక్షంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 317 జీవోను సవరించి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం.
Read Also: VijayaSaiReddy: టీడీపీ పాలనలో ఒక కులంలో, ఒక జిల్లాలోనే అభివృద్ధి