Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదల కానుంది. త్వరలో నామినేషన్లు వేయనున్నారు. దాదాపు అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి.
BJP First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
Off The Record: తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కొంతమేరకైనా… అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బీజేపీ కేంద్ర నాయకత్వం… ఇక్కడ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఓవైపు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతుంటే… తాము మాత్రం ఏ క్లారిటీ లేక కామ్‌గా చూస్తూ ఉండాల్సి వస్తోందని బాధ పడుతున్నారట తెలంగాణ కాషాయ నేతలు. ఎందుకిలా జరుగుతోంది? ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆరా తీస్తున్న నేతలకు వెయిట్…. వెయిట్… ఒకటి రెండు రోజుల్లో మీ నంబర్…
Kishan Reddy: అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, గ్రూప్ -1 ఇష్యూపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అప్పులు చేసి నిరుద్యోగులు కోచింగ్ తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్‌లో పర్యటించనున్నారు. బీజేపీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎల్లేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం గత నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.