నిత్య యవ్వనంవృద్ధాప్యం అనేది ఎవ్వరూ ఆపలేని సహజ ప్రక్రియ. కానీ సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని కాస్త నెమ్మదించవచ్చు. ముఖ్యంగా పురుషులు నిత్య యవ్వనంగా ఉండేందుకు ఇలా చేయండి.
చేపలు సాల్మన్, ట్యూనా, మాకరెల్ వంటి కొవ్వు చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో మంటను తగ్గించడానికి, మెదడు పనితీరు మెరుగవుతుంది. యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు ఉన్నాయి.
ఆలివ్ ఆయిల్ఆలివ్ ఆయిల్ లో మోనోశాచురేటెడ్ కొవ్వులు చాలా ఉంటాయి. కొవ్వులు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాపును తగ్గిస్తాయి.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ యాక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
రాజ్మాడైట్లో రాజ్మాను కచ్చితంగా తీసుకోవాలి. దీనిలో ఫైబర్స్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. గుండె సమస్యలు తగ్గుతాయి.
ఆకు కూరలు
ఆకు కూరల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల గుండె ఆరోగ్యంతో పాటు క్యాన్సర్ నుంచి రక్షణ పొందచ్చు.
నట్స్నట్స్ లో హానికరమైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. హృదయ సంబంధ వ్యాధులు, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎముకల బలానికి తోడ్పడతాయి.
డార్క్ చాకోలెట్
డార్క్ చాకోలెట్లో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తాయి. 70% కోకో ఉన్న చాకోలెట్ మరిం ఉపయోగకరంగా ఉంటుంది.
బెర్రీబెర్రీస్ లో యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. బ్లూబెర్రీస్, రోస్బెర్రీస్, స్టాబెర్రీస్ లో పాలీఫెనాల్స్ ఉంటాయి. వయసు సంబంధింత వ్యాధుల నుంచి రక్షిస్తుంది.