Virat Kohli back in top 10 of ICC Test Rankings: ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఏడాది విరామం తర్వాత టాప్-10కు దూసుకొచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో రాణించిన కోహ్లీ.. నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. విరాట్ 2022లో టాప్-10 నుంచి చోటు కోల్పోయాడు. ఏడాది తర్వాత మళ్లీ సత్తాచాటాడు. మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 38 రన్స్ చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 46 రన్స్ బాదాడు.
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. విలియమ్సన్ ఖాతాలో ప్రస్తుతం 864 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఖాతాలో 761 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. కేన్, విరాట్ మధ్య 103 పాయింట్ల అంతరం ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో ఉన్నారు. బౌలర్లలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా నాలుగు, జస్ప్రీత్ బుమ్రా అయిదో స్థానంలో నిలిచారు. ఇక టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ నంబర్‌వన్ ర్యాంకులో కొనసాగుతోంది.
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓడితే 0-2తో క్లీన్‌స్వీప్ పరాభవం ఎదురువుతుంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ సత్తాచాటి టీమ్ ఆశలు నిలిపాడు. బౌన్స్, స్వింగ్, సీమ్‌ను ఉపయోగించుకుని.. సఫారీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. సిరాజ్ (6/15) ధాటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్ అయింది. వెరీన్ (15) టాప్ స్కోరర్. ఆపై రబాడ (3/38), ఎంగిడి (3/30), బర్గర్ (3/42) చెలరేగడంతో భారత్ 153 పరుగులకు ఆలౌటైంది. విరాట్ కోహ్లీ (46; 59 బంతుల్లో 6×4, 1×6) టాప్ స్కోరర్. 98 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 62 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 36 పరుగులు వెనుకబడి ఉంది.