అక్టోబర్ 10న ఆదిలాబాద్‌లో బహిరంగ సభ, హైదరాబాద్‌లో మేధావుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ర్యాలీలో ప్రసంగిస్తారని, సాయంత్రం మేధావుల సదస్సులో షా హాజరవుతారని బీజేపీ శ్రేణులు వెల్లడించారు. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి షా పర్యటన ఊపునిస్తుందని తెలంగాణ బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో, ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల ప్రారంభంలో తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని రెండు ర్యాలీలలో కూడా ప్రసంగించారు. అయితే.. ఈ మేరకు రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఈ మేరకు అమిత్ షా షెడ్యూల్‌ను విడుదల చేసింది బీజేపీ.
అమిత్ షా రేపటి షెడ్యూల్:
► మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు అమిత్ షా
►2.35కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు.
►మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు.
►4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.
►5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
►5. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం
► 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కు బయల్దేరనున్నారు.
►6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది.
► రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలోబీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం
►రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ
►రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం
►9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.