హైదరాబాద్ తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ కాల్పులు కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ పాయింట్ వద్ద ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే ఒక రౌడీ షీటర్ ను దారుణంగా హతమార్చిన ఘటన సంచలనంగా మారింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్ పై మరో రౌడీషీటర్ పాయింట్ బ్లాంక్ లో పిస్టల్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటన పై బాలనగర్ డీసీపీ సందీప్ రావు రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు.
read also: Andhra Pradesh BJP :: బీజేపీపై అమరావతి రైతులు కోపంగా ఉన్నారా..?
అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. నిన్న రాత్రి కాల్పులు జరిగాయని, ఒక వ్యక్తి చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. క్రైమ్ ఎక్కడ కంట్రోల్ అయింది? అని ప్రశ్నించారు. తెలంగాణలో గన్ కల్చర్ వచ్చిందని విమర్శించారు. కార్డన్ సెర్చ్ పాతబస్తీలో ఎందుకు బందు అయిందని ప్రశ్నించారు. హోమ్ మినిస్టర్ డమ్మీ నా, రబ్బర్ స్టాంప్ అంటూ ఎద్దేవ చేసారు. శాంతి భద్రతలు కాపాడడం పై యోగి ఆదిత్య నాథ్ ను కలవండి సీఎం గారు అంటూ సంచళన వ్యాఖ్యలు చేసారు. యోగి ఆదిత్య నాథ్ కాళ్ళు నొక్కండి కొద్దిగా గైడెన్స్ వస్తుందని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయండం సంచలనంగా మారింది.
Firing in Madhapur: రియల్ ఎస్టేట్ వివాదమే కాల్పులకు కారణం..బాలనగర్ డీసీపీ సందీప్ క్లారీటీ