జూలై 18న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈనేపథ్యంలో.. వీటిని దృష్టిలో పెట్టుకుని 17వ తేదీ ఉదయం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ నిర్ణయించింది. అయితే.. సంబంధిత మంత్రి ప్రహ్లాద్ జోషి, సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులు.. ఎజెండాలోని ఇతరత్రా అంశాల గురించి ఆయా పార్టీల నేతలకు వివరించి, వారి సహకారం కోరనున్నారు. ఈకార్యక్రమంలో.. ప్రధాని మోదీ మర్యాదపూర్వకంగా అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. జూలై 18న (అదే రోజు) సాయంత్రం…