Zika Virus: మహారాష్ట్రలో మళ్లీ జికా వైరస్ కలకలం.. ఏడేళ్ల బాలికకు పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో మరోసారి జికా వైరస్ కేసు వెలుగుచూసింది. మహారాష్ట్రలో ఓవైపు కొవిడ్-19 కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తుంటే మరోవైపు జికా వైరస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లాకు చెందిన ఓ ఏడేళ్ల బాలికకు జికా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఆమె చదువుకుంటోందని అధికారులు తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జికా వైరస్ కేసు గతేడాది జులైలో పుణెలో నమోదైందని పేర్కొన్నారు.
OYO Offer: ‘ఓయో’ స్పెషల్ ఆఫర్.. అమ్మాయిలకు మాత్రమే..!!
Also Read
- CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ.. ఇప్పటి వరకూ దీనికి మందు లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఈ వైరస్ సోకితే కొందరిలో జ్వరం, దద్దర్లు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు సోకితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత 1947లో ఉగాండా అడవుల్లో కోతుల్లో ఈ వైరస్ కనిపించింది. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి. కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో.. ఇటీవలే మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలో జికా వైరస్ కేసు వెలుగు చూడడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
తాజావార్తలు
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!