JIO Recharge: ప్రస్తుతం దేశంలో జియో (Reliance Jio) అత్యధిక యూజర్లను కలిగి ఉన్న టెలికాం నెట్‌వర్క్‌గా కొనసాగుతుంది. తన యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతూ, వారు కోరుకునే ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త ప్లాన్‌లను ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతోంది. ఇకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ఆకట్టుకునే ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన జియో.. తాజాగా మరోమారు ఓ అద్భుతమైన సూపర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read: Good Bad Ugly: గుడ్.బ్యాడ్.అగ్లీకి కొత్త రిలీజ్ డేట్
రిలయన్స్ జియో తాజాగా రూ.1234 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్లు కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే యూజర్ల కోసం ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. అదనంగా, జియో యాప్‌లను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 336 రోజుల వ్యాలిడిటీ పొందవచ్చు. అంతేకాకుండా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 500MB డేటా, ప్రతి 28 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అంటే, ఈ ప్లాన్‌తో యూజర్లు పూర్తిగా 11 నెలలపాటు ప్రయోజనాలను పొందగలరు. అయితే, ఈ ప్లాన్ జియో భారత్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం కాలింగ్ అవసరాలు ఉన్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో సావాన్ వంటి యాప్ లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
Also Read: Bajaj Bikes: ఇకపై ఆ పాపులర్ బైకులు రోడ్లపై కనుమరుగు
అలాగే జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం రూ. 234 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 500MB డేటా ఇంకా ప్రతి 28 రోజులకు 300 SMS లభిస్తాయి. అలాగే , జియో సావాన్, జియో సినిమా, జియో టీవీ యాప్‌లను కూడా వినియోగించుకోవచ్చు.