Survival Story : సముద్రం.. మనలో చాలా మందికి సముద్రం అంటే చాలా భయం.. ఇంకొంత మందికి సముద్రం అంటే చాలా ఇష్టం. ఎక్కువ శాతం మంది తమ హాలిడేస్ ను సముద్రం వద్ద గడపాలని.. ఇంకొంతమంది అయితే సముద్రం మధ్యలో గడపాలని అనుకుంటారు. అందుకే కొంత మంది క్రూజ్ లలో ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణిస్తే.. మరి కొందరు యాట్ లలో కూర్చొని సముద్రాన్ని ఆస్వాదిస్తారు. ఒక వేల అలా చేసినా.. సముద్రం మధ్యలో ఎన్ని రోజులు ఉండగలరు. పెద్ద పెద్ద క్రూజ్ లలో పక్కనే జనాలను పెట్టుకొని, లగ్జరీస్ తో కాదు. ఒక చిన్న పడవలో ఒక సముద్రం మధ్యలో ఎన్ని రోజులు ఉండగలరు.. ఒక రోజు, వారం, పది రోజులు.. ఒక మామూలు మనిషి.. ఒక్క రోజు కూడా ఉండలేదు. రాత్రి సమయంలో ఆ చీకటిలో చుటూ పక్కల ఎటు చూసినా భూమి కనిపించకుండా ఉంటే.. ఆ భయానికే గుండె ఆగిపోతుంది. మరి అలాంటిది ఒక మనిషి ఒంటరిగా.. 438 రోజులు అంటే దాదాపు 14.4 నెలల పాటు సముద్రంలో ఉన్నాడు. తనకు తెలియకుండానే ఎవరూ కలలో కూడా బ్రేక్ చేయాలి అనుకోని రికార్డు ను క్రియేట్ చేశాడు. అతడే మెక్సికోకు చెందిన హోసే సాల్ వడార్ ఆల్వరెంగా (José Salvador Alvarenga). అసలేం జరిగింది.
ఇప్పుడు ఒకసారి మనం చిన్నప్పుడు సోషల్ లో చెప్పిన వరల్డ్ జియోగ్రఫీ గురించి మాట్లాడదాం. మన భూమి మీద 7 ఖండాలు, 5 మహా సముద్రాలు ఉన్నాయి.. ఏవే కాంటినెంట్స్ అండ్ ఓసీన్స్. ఈ భూమిపైనా 71% ఓసీన్స్ ఉన్నాయి అన్న విషయం మనకు తెలిసిందే. అందులో 30% కేవలం పసిఫిక్ ఓషన్ ఉంది. పసిఫిక్ ఓషన్ 165.2 మిలియన్ స్క్వేర్ కిమిల మేరకు విస్తరించింది. అంటే భూమిపైన ఉన్న అన్ని కాంటినెంట్స్ ను కలిపినా కూడా వాటన్నింటి కంటే పెద్దది పసిఫిక్ ఓషన్. ఒక్క పసిఫిక్ ఓషన్ మాత్రమే.. భూమిపై ఉన్న అన్ని దేశాలను ముంచేయగలదు. అలాంటి పసిఫిక్ ఓషన్ లో ఎవరైనా తప్పిపోయారంటే.. అక్కడితో వారిపైన ఆశలు వదులుకోవలసిందే. అలాంటిది ఒక వ్యక్తి పసిఫిక్ ఓషన్ లో తప్పిపోయి.. 438 రోజుల నరకయాతన తర్వాత మళ్ళీ భూమిపై అడుగుపెట్టాడు. ఆ అమేజింగ్ సర్వైవల్ స్టోరీ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం.
Read Also: JIO Recharge: న్యూ ఇయర్ సందర్భంగా మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన జియో
ఈ ఇన్సిడెంట్ 2012 నవంబర్ 17న జరిగింది. మెక్సికోకి చెందిన హోసే సాల్ వడార్ ఆల్వరెంగా మంచి నైపుణ్యం ఉన్న అండ్ చాలా ఎక్స్పీరియెన్స్ ఉన్న సైలర్ అండ్ ఫిషర్ మ్యాన్. అతను డీప్ సీ ఫిషింగ్ చేయడం కోసం 30 గంటలు సముద్రంలోకి వెళ్ళాలి అనుకున్నాడు. మామూలుగా డీప్ సీ ఫిషింగ్ చేయడం వల్ల పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. అందుకే డీప్ సీ ఫిషింగ్ కోసం వెళ్ళాలి అనుకున్నాడు. అయితే రెగ్యులర్ గా తనతో పాటు వచ్చే తన పార్ట్నర్ ఆ ట్రిప్ కు వెళ్ళలేదు. అందుకే 23 ఏళ్ళ ఎజికిల్ కొర్డోబాను ఈ సారి తన పార్ట్నర్ గా తీసుకెళ్లాడు అల్వరెంగా. అయితే కొర్డోబా తో అల్వరెంగాకు అప్పటి వరకు అసలు పరిచటం లేదు. ఇద్దరూ కలిసి ఒక 7 మీటర్ ల టాప్ లెస్ బోట్ తీసుకొని ఫిషింగ్ కి స్టార్ట్ అయ్యారు. ఆ బోట్ లో పెద్దగా ఎక్విప్మెంట్ కూడా లేదు. కేవలం పట్టిన చేపలను భద్రపరచడానికి ఫ్రిడ్జ్ సైజు లో ఉన్న ఒక ఐస్ బాక్స్ తమతో పాటు తెచ్చుకున్నారు. డీప్ సీ ఫిషింగ్ కోసం ఇద్దరూ తీరానికి బాగా దూరంగా వెళ్లారు. అనుకున్న ప్లేస్ కి రీచ్ అవ్వగానే ఫిషింగ్ స్టార్ట్ చేశారు. ఫిషింగ్ మొదలు పెట్టిన కొద్దీ సేపటికే 500 కిలోల చేపను పట్టుకున్నాడు అల్వరెంగా. అది చూసిన ఆనందంలో మరింత ముందుకు సాగారు.
అలా తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో తమ ఫిషింగ్ ను మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దీ సేపటికే సముద్రంలో భారీ తుఫాను మొదలైంది. భయంతో ఒక్కసారిగా ఆ ఇద్దరూ వచ్చిన పనిని సైతం వదిలేది తీరంవైపుకు బోట్ ను తిప్పారు. అయితే ఇద్దరూ 100 కిమిమేటర్ల దూరంలో ఉన్నారు. ఇలా తుఫాన్ కంటిన్యూ అయితే ఒక గంట కూడా సర్వైవ్ అవ్వలేరు. ఈ విషయం గురించి వారికి క్లారిటీ ఉంది. కానీ బ్రతకాలని ఆశ, అల్వరెంగా నైపుణ్యం ఈ ఇద్దరినీ.. తీరానికి దగ్గరగా తెచ్చింది. కానీ అదే సమయంలో తమ బోట్ కి ఉన్న ఇంజిన్ చెడిపోయింది. ఒక్క సారిగా ఇద్దరికీ మళ్ళీ భయం స్టార్ట్ అయ్యింది. అల్వరెంగా తన దగ్గర ఉన్న టు వే రేడియో ఉపయోగించి.. తన యజమానికి తన పరిస్థితి చెప్పే ప్రయత్నం చేసాడు. అదే సమయంలో ఆ రేడియో కూడా చెడిపోయింది. ఇక చేసేది ఏమీ లేక అలాగే కూర్చుండిపోయారు ఆ ఇద్దరు. కానీ సమాచారం అందుకున్న అల్వరెంగా యజమాని మాత్రం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అల్వరెంగా కోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేయించాడు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. కానీ సముద్రం ఉన్న పరిస్థితుల్లో అక్కడి తుఫానులో అల్వరెంగాను కనుక్కోవడం పోలీసులకు కూడా అంతే తేలికైన పని కాదు.
ఎంత కష్టమైనా పోలీసులు తమ సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేశారు. కానీ ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయారు. ఆ తుఫానులో ఏమీ కనిపించని పరిస్థితి. అప్పటికే బోట్ కాస్త తీరానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్ ను ఆపేసారు. 5 రోజులకు అల్వరెంగా, కొర్డోబా ఇద్దరూ చనిపోయారని నిర్దారించారు. కానీ తమ కుటుంబ సభ్యలకు మాత్రం ఆశ చావలేదు. అల్వరెంగా, కొర్డోబా కూడా ఎలాగైనా ఇంటికెళ్లాలన్న పట్టుదలతో ఉన్నారు. రోజులు కాస్తా నెలలయ్యాయి.. తీరానికి ఇద్దరూ వేల కిలోమీటర్ల దూరానికి వెళ్లిపోయారు. మొదట్లో ఉన్న నమ్మకం ఇప్పుడు లేదు. నమ్మకం మాత్రమే కాదు.. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. సముద్రంలో వెళ్లే చేపలను, తాబేళ్లను, ఆ దారిలో వెళ్లే పక్షులను బేర్ హ్యాండ్ తో చంపి అలాగే పచ్చిగా తినడం మొదలు పెట్టారు. ఒక్కో సారి.. పెద్ద పెద్ద షిప్స్ నుంచి బయట పడేసిన వ్యర్థాలు కూడా తినేవారు. ఇక దాహం వేస్తే తాబేలు రక్తం తాగేవారు, సముద్రంలో దొరికిన వాటర్ బాటిల్స్ లో వర్షపు నీటిని పట్టుకొని తాగేవారు. వర్షం రాని రోజు తమ మూత్రం తాగేవారు. అలా 4 నెలలు గడిచింది. కొర్డోబాకు బ్రతుకుతాను అనే నమ్మకమే కాదు బ్రతకాలని ఆశ కూడా నశించింది. ఆ పచ్చి మాంసం తిని ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆ తర్వాత పూర్తిగా తినడం మానేసాడు. అలానే తిండి తినకుండా చనిపోయాడు. చనిపోయే ముందు తన శవాన్ని తినొద్దని.. అల్వరెంగా చేత ఒట్టేయించుకుని చనిపోతాడు కొర్డోబా. కొర్డోబా మరణం తర్వాత ఒంటరైపోయాడు అల్వరెంగా.
కొర్డోబా చనిపోయిన 4 రోజుల తర్వాత అల్వరెంగా కూడా చనిపోవాలి అని ఫిక్స్ అయ్యాడు. కానీ తను నమ్మే ధర్మం ప్రకారం ఆత్మ హత్య మహా పాపం. అందుకే మళ్ళీ నమ్మకం తెచ్చుకొని ముందుకు సాగాడు. అలా రోజులను కౌంట్ చేసుకుంటూ.. కొర్డోబా శవంతో మాట్లాడుకుంటూ రోజులు గడిపాడు. అయితే కొర్డోబా బాడీతో ఇలానే మాట్లాడుతుంటే పిచ్చ్చేక్కుతుందేమో అనే భయంతో ఆ శవాన్ని సముద్రలో పడేసాడు అల్వరెంగా. తన ఈ జర్నీలో తనకు చాలా సార్లు తనకు కంటైనర్ షిప్స్ కనిపించాయి. కానీ అల్వరెంగా చిన్న బోట్ లో వెళుతుండటం, తన వద్ద కనీసం ఫ్లేర్ గన్ కూడా లేకపోవడం వల్ల.. ఆ కంటైనర్ షిప్స్ కు ఎటువంటి సిగ్నల్స్ పంపలేకపోయాడు అల్వరెంగా. అలాగే ప్రాణంపై ఆశ వదులుకొని ఆ చిన్న బోట్ లో దాదాపు 11000 కిమిలు జర్నీ చేసాడు. 11000 కిమిలా జర్నీ తర్వాత సముద్రంలో తేలుతూ కోకొనట్స్ కనిపించడం చూసిన అల్వరెంగాకు మళ్ళీ ప్రాణం నిలుస్తుందని నమ్మకం కలిగింది. వెంటనే అవి ఎటువైపు నుంచి వచ్చాయో అని చూసిన అల్వరెంగాకు ఒక ఐలాండ్ కనిపించింది. అది చూసిన అల్వరెంగా మళ్ళీ ఈ ల్యాండ్ నుంచి కూడా దూరంగా వెలతాడేమో అన్న భయంతో వెంటనే తన బోట్ ని వదిలేసి సముద్రంలోకి దూకి ఈత కొడుతూ ఒడ్డుకు చేరాడు. 438 రోజు అంటే 14 నెలల తర్వాత అల్వరెంగా నేలపై అడుగుపెట్టడం కాదు నేలను చూడటం ఇదే మొదటి సారి.
Read Also:CM Chandrababu: కుప్పంలో ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభం.. ఎవరైనా తోక తిప్పితే తాట తీస్తా..!
ఆ ఐలాండ్ కూడా మిస్ అయ్యుంటే మరో 5 వేల కిమిలా వరకు మరో ఐలాండ్ లేదు. పొరబాటున ఆ ఐలాండ్ చేరకపోయుంటే మరో ఐలాండ్ చేరడానికి మరో సంవత్సరం పట్టి ఉండేది. అల్వరెంగాను ఆ పరిస్థితిలో చూసిన ఒక కపుల్ తనను హాస్పిటల్ లో చేర్పించారు. 11 రోజులు తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అల్వరెంగా. అల్వరెంగా బ్రతికి మళ్ళీ వెనక్కు రావడంతో తన కుటుంబ సభ్యులు ఆనందంతో పాటు ఆశ్చర్యపోయారు. అయితే 438 రోజుల తర్వాత వెనక్కు వచ్చిన అల్వరెంగాకు చేదు అనుభవం ఎదురైంది. తనతో పాటు సముద్రంలోకి వెళ్లిన కొర్డోబాను అల్వరెంగా చంపి తినేశాడని కొర్డోబా కుటుంబ సభ్యులు తనపై కేసు వేశారు. కొన్ని సంవత్సరాలు న్యాయపోరాటం చేసిన తర్వాత నిర్దోషిగా ఆ కేసు నుంచి బయటపడ్డాడు ఆల్వరెంగా . 30 గంటల డీప్ సీ ఫిషింగ్ కోసం వెళ్లి ఏకంగా 438 రోజులు నరకయాతన అనుభవించాడు హోసే సాల్ వడార్ ఆల్వరెంగా. సో మనలో చాలా మంది చిన్న చిన్న విషయాలను కష్టాలు అనుకుని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకు ఈ స్టోరీ చూపించండి.