Warangal: వరంగల్ రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. రైల్వేస్టేషన్ లోని వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో నీరు రేకులపై పడింది. ఆ నీటి ఒత్తిడికి ఒకటో నంబర్ ప్లాట్ ఫాం పై నుంచి రేకులు ఊడిపోయాయి. ఈ సమయంలో ప్లాట్ ఫాంపై ఉన్న ముగ్గురిపై రేకులు పడ్డాయి. కాగా వారందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. గాయపడిన ముగ్గురు ప్రయాణికులు రైలు కోసం ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
Read also: Shiva Karthiyekan: మహావీరుడు తెలుగు షోస్ క్యాన్సిల్…
ఈ ప్రమాదం గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి కావడంతో ప్లాట్‌ఫారమ్‌పై పెద్దగా ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున ఉండి ఉంటే పెను ప్రమాదం జరిగేదని సిబ్బంది చెబుతున్నారు. ముగ్గురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వాటర్ ట్యాంకర్ పగిలిపోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న రైల్వే భవనంపై 30 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ పగిలింది. దీంతో నీటి పీడనానికి బిల్డింగ్ రెయిలింగ్ ధ్వంసమై ఒకటో నంబర్ ప్లాట్ ఫాంపై ఉన్న షీట్లపై పడింది. దీంతో రేకులు కూలిపోయాయని రైల్వే సిబ్బంది చెబుతున్నారు.
Peach Health Benefits: ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించే ఫ్రూట్ ఇదే.. ఈరోజే ఆహారంలో చేర్చుకోండి!