కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి లాభాలని ఇచ్చిన హీరో, ప్రిన్స్ సినిమాతో కనీసం బ్రేక్ ఈవెన్ మార్క్ ని కూడా టచ్ చెయ్యలేకపోయాడు. దీంతో తమిళనాడులో శివ కార్తికేయన్ మార్కెట్ కి డెంట్ పడింది. దాన్ని కవర్ చెయ్యాలన్నా, ఒకప్పటిలా మళ్లీ బయ్యర్స్ తనని నమ్మలన్నా శివ కార్తికేయన్ కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆ హిట్ ని అందుకోవడానికి శివ కార్తికేయన్ ‘మావీరన్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు.
‘మండేలా’ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ ‘మడోన్ అశ్విన్’ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జులై 14న గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని కోలీవుడ్ సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తెలుగులో మాహావీరుడు అనే టైటిల్ తో ఈ మూవీ రిలీజ్ కానుండడంతో ఇక్కడ కూడా మహావీరుడు సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసిన మావీరన్ సినిమాకి కోలీవుడ్ లో మంచి రివ్యూస్ వస్తున్నాయి కానీ తెలుగులో మాత్రం సౌండ్ లేదు. ఇందుకు కారణం మహావీరుడు షోస్ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ అవ్వడమే. టెక్నీకల్ ఇష్యూస్, కంటెంట్ డెలివరీ, రేట్స్ కారణంగా మహావీరుడు సినిమా షోస్ తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ఫస్ట్ డే మహావీరుడు సినిమా చూడాలి అనుకున్న ఫాన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఈ ఇష్యూని సాల్వ్ చేసి మహావీరుడు సినిమాని తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ షో నుంచి కానీ అందులోబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. తమిళ్ లో విజయ్ సేతుపతి వాయిస్ ఓవర్ ఇచ్చిన మావీరన్ సినిమాకు తెలుగులో మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.