Green India Challenge: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘హరా హైతో భరా హై’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం.. నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారింది. ‘మట్టిని కాపాడుకుందాం – మొక్కను బతికించుకుందాం’ అని ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన పిలుపులో ప్రముఖులు, పట్టణాలు, పల్లెలు మమామేకం అవుతూనే ఉన్నాయి..
Read also: Eng vs Ire: ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాక్.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామస్తులు 20,000 మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముఖరా కె గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో 10 ఎకరాల స్థలంలో గ్రామస్తులు 20,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గె మినాక్షి మాట్లాడుతూ గ్రామంలో నేడు 20 వేల మొక్కలు నాటామని, గ్రీన్ ఇండియా చాలెంజ్ లో ఇప్పటి వరకు గ్రామంలో 80,000 మొక్కలు నాటి వందశాతం మొక్కలను రక్షిస్తున్నామని తెలిపారు.. ఇప్పుడు గ్రామం మొత్తం హారితగ్రామంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుభాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
karthi – Sardar Part 2: సీక్వెల్స్ మీద సీక్వెల్స్ .. జోరు మీదున్న హీరో కార్తీ