ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు…
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ నాయకులకు విచిత్రమైన సమస్య వచ్చి పడిందట. పండగ అన్న మాట వినిపిస్తే చాలు… నిద్రలో కూడా ఉలిక్కిపడి లేస్తున్నారట. ఎవరికి వారు పండగల్ని హాయిగా, జాలీగా, కుటుంబ సమేతంగా చేసుకుంటుంటే… వీళ్ళకు మాత్రం అదీఇదీ అని లేదు. ఏదో ఒకటి… పండగ… అన్న మాట వినిపిస్తే చాలు దిగాలుగా ఫేస్‌లు పెట్టేసి జేబులు తడుముకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. మరీ ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలకే…
దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ కు…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో రూ.10 రూపాయలు ఇచ్చి మైనర్ బాలిక పై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన చోటు చేసుకుంది. షీటీం అవగాహనతో విషయం బయటకు వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.. నిందితుడు బంగారిగూడకు చెందిన జాదవ్ కృష్ణగా గుర్తించి అరెస్టు చేశారు.
బెట్టింగ్‌కు యువకుడి బలైన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జైనాథ్ మండలం పిప్పర్‌వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపం చెందాడు. అభ్యుదయ పాఠశాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
TG Weather: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.
జాతీయ రహదారిపై పులి కనిపించింది. నేరడిగొండ మండలం నిర్మల్ ఘాట్ సెక్షన్ పైన రోడ్డు దాటింది. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దుల గుండా రోడ్డు దాటింది. రోడ్డు పై దర్జాగా వెళ్తున్న పులిని చూసిన వాహనదారులు.. హడలెత్తిపోయారు. కారు, లారీ లో ప్రయాణిస్తున్న డ్రైవర్‌లుసెల్ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.