Justice : 2008లో 37 ఏళ్ల వయసులో సేవా లోపంపై న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఒక ప్రైవేటు ఉద్యోగి, 17 ఏళ్ల దీర్ఘ న్యాయపోరాటం తర్వాత 54 ఏళ్ల వయసులో విజయం సాధించారు. చివరకు రూ.10 లక్షల పరిహారం అందుకున్నారు. 2006లో మలేసియా టౌన్‌షిప్‌లోని రెయిన్ ట్రీ పార్క్ ఎ-బ్లాక్‌లో శివ కె.రావు ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి, కారు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించారు. అయితే, ఆయనకు పైపులు లీకయ్యే, ఇరుకైన అసౌకర్యంగా ఉన్న పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. దీన్ని మార్చాలని కోరినా అధికారులు స్పందించలేదు.
Broccoli: బ్రోకలి శాండ్‌విచ్ తిని ప్రముఖ మ్యూజీషియన్ మృతి.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
దీంతో, 2008లో ఆయన ఏపీహెచ్‌బీ (ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు) , ఐజేయం జాయింట్ వెంచర్ సిట్కో ప్రైవేట్ లిమిటెడ్‌పై రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. 2011లో జిల్లా కమిషన్ ఆయన వాదనలను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత సిట్కో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీల్ వేసినా, 2013లో రూ.10 వేల కేసు ఖర్చులతో అది కొట్టివేయబడింది.
సిట్కో తరువాత జాతీయ వినియోగదారుల కమిషన్‌లో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. 2020 అక్టోబర్ 27న అక్కడ కూడా శివ కె.రావు స్వయంగా వాదించి విజయం సాధించారు. స్టేట్ కమిషన్ తీర్పు తర్వాత 2014లో అమలు పిటిషన్ వేసినా, రివిజన్ పిటిషన్ కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. చివరికి, సోమవారం ఈ వివాదానికి ముగింపు లభించింది. కారు పార్కింగ్ కేటాయించడం సాధ్యం కాదని ప్రతివాది సంస్థ అంగీకరించి, ప్రత్యామ్నాయంగా రూ.10 లక్షలు చెల్లించింది. ఫిర్యాదుదారు ఖాతాలో డబ్బు జమ కావడంతో, రంగారెడ్డి జిల్లా కమిషన్ అధ్యక్షురాలు లతాకుమారి, సభ్యుడు జవహర్‌బాబు ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌ను ముగించారు.
War 2: జూనియర్ ఫాన్స్, ఎటాక్.. వార్ 2 బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్!