ఎట్టకేలకు మోస్ట్ అవైటెడ్ జూనియర్ ఎన్టీఆర్ “వార్ 2” సినిమా తెలుగు స్టేట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న “వార్ 2” సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్టర్‌గా చేస్తున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందింది. “వార్” సినిమాకి సీక్వల్‌గా ఈ సినిమాని సిద్ధం చేశారు.
Also Read:Lavanya Tripathi : ‘చిత్తూరు పిల్ల’నంటున్న మెగా కోడలు!
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు రెండు కాలర్లు ఎగరేసుకునేలా ఈ సినిమా ఉంటుందని చెప్పడంతో జూనియర్ అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన బుకింగ్ తాజాగా ఓపెన్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన తెలుగు స్టేట్స్ హక్కులన్నింటినీ నాగవంశీ మంచి ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని భాషల్లోనూ నాగవంశీ రిలీజ్ చేయబోతున్నాడు.