Justice : 2008లో 37 ఏళ్ల వయసులో సేవా లోపంపై న్యాయం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఒక ప్రైవేటు ఉద్యోగి, 17 ఏళ్ల దీర్ఘ న్యాయపోరాటం తర్వాత 54 ఏళ్ల వయసులో విజయం సాధించారు. చివరకు రూ.10 లక్షల పరిహారం అందుకున్నారు. 2006లో మలేసియా టౌన్‌షిప్‌లోని రెయిన్ ట్రీ పార్క్ ఎ-బ్లాక్‌లో శివ కె.రావు ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి, కారు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించారు. అయితే, ఆయనకు పైపులు లీకయ్యే, ఇరుకైన…
బెంగాల్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహమ్ చక్రవర్తి రెస్టారెంట్‌లో రెచ్చిపోయారు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ సమస్య తలెత్తింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమానిని చెంపదెబ్బ కొట్టారు.
Parking: ఇటీవల కాలంలో పార్కింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు భౌతికదాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా న్యూ ఇయర్ రోజు పార్కింగ్ వాగ్వాదం ఒకరి మరణానికి కారణమైంది. ఘజియాబాద్‌లోని మోడీ నగర్‌లో పార్కింగ్ వివాదంతో కోపం పెంచుకున్న ఓ వ్యక్తి తన ఎస్‌యూవీ కార్‌తో 30 ఏళ్ల వ్యక్తిని 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో సదరు వ్యక్తి మరణించినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
పార్కింగ్ విషయంలో తరచు గొడవలు జరగడం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఒకరిపై మరొకరు విచక్షణా రహితంగా దాడి చేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక తాజాగా ఓ హౌసింగ్ సొసైటిలో పార్కింగ్ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ వివాదం పెద్దది కావడంతో పోలీసులు కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది. అయినా కూడా తగ్గని స్థానికులు పోలీసులపై కూడా దాడి చేశారు. వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న ఫ్లోరా హెరిటేజ్ హౌసింగ్…