19 lakhs being transported in a Breeza car: మునుగోడు ఉప్ర ఎన్నికల్లో ధన ప్రవాహం జోరందుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మునుగోడుకు డబ్బుల వరద కొనసాగుతుంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు ప్రతిఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో యదేచ్ఛగా మునుగోడుకు డబ్బులు రవాణా అవుతున్నాయి.
Read also: Muslim Girl: మేజర్ కాకుండానే పెళ్లికి అర్హులా..? తేల్చనున్న సుప్రీంకోర్టు
నిన్న సాయంత్రం మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఓ కారులో కోటి రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నా డబ్బులు తరలించే వ్యవహారం మాత్రం ఆగడం లేదు. మళ్లీ ఇవాళ కూడా నల్లగొండ జిల్లా గట్టుప్పల్ శివారులో 19లక్షలు నగదును పట్టుకున్నారు అధికారులు. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. TS07FY 9333 బ్రీజా కారులో 19 లక్షలు తరలిస్తుండటంతో పోలీసులు అడ్డగించారు. కారును ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 19 లక్షల నగదుపై పోలీసులు విచారిస్తున్నారు. కారులో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు.
Read also: Helicopter Crash in Kedarnath: కేదర్ నాథ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి 6 మంది మృతి
అయితే… నిన్న సాయంత్రం మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఓ కారులో కోటి రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈడబ్బు బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించిన డబ్బులు గా భావిస్తున్నారు. ఈ డబ్బులను మునుగోడుకు ఎందుకు తీసుకు వస్తున్నారు అన్నదానిపై విచారణ చేపట్టారు. బీజేపీ నాయకులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల వాహనాలను తనిఖీ చేయడం లేదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఇవాళ కూడా రూ.19లక్షలు డబ్బు దొరకడంతో.. తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు.
Pawan Kalyan: బూతులు తిట్టే వైసీపీ నేతలకు వార్నింగ్.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా..!!