అమర వీరుల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నక్క లాగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ చేతిలో తెలంగాణ ప్రజలు పడకూడదని, కుటుంబ, అవినీతి, అహంకార పార్టీలు తెలంగాణకు అవసరం లేదన్నారు. అబద్ధాలు, మోసాలు, కుట్రలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎవరు నెరవేరుస్తారో గుర్తించారు.. కాబట్టే బీజేపీకి రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతుందన్నారు. సెల్ ఫోన్ సర్వేకు, బాత్ రూం సర్వేలు చేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు.
Also Read: Vijayashanti: కేసీఆర్ పతనం మొదలైంది.. ప్రకృతి కూడా సహకరించడం లేదు
ఖచ్చితంగా బీజేపీని నిశబ్ద విప్లవంతో సునామీలా ప్రజలు ఓటు వేయబోతున్నారన్నారని, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు రాబోతున్నారని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు బీజేపీనీ ఆదరిస్తున్నారని, ముస్లింలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలు రాజకీయ అవగాహన లేకుండా రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషించిందే మీ కుటుంబం రాహుల్ గాంధీ.. దేశ విభజనకు కారణం అయిన ముస్లిం లీగ్ను పెంచి పోసించినట్టే.. mimను మీరు పెంచి పోషించారన్నారు. మజ్లిస్ పార్టీ కార్యాలయం ఇందిరా గాంధీ వెళ్ళారని, తమ సీఎంనే గద్దె దించేందుకు మత కల్లోలాలు mimను ముందు పెట్టి సృష్టించారని కిషన్ రెడ్డి ఆరోపించారు.
Also Read: CM KCR: తెలంగాణే ఆశగా, శ్వాసగా బతుకుతున్నా..