ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం బీఆర్ఎస్ ఎంపీపీ పూర్ణయ్య కాంగ్రెస్ లో చేరారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, కూనంనేని సాంబశివరావు సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడికి భట్టి ఖండించారు.
Read Also: BJP vs BRS: బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి చేసిన బీఆర్ఎస్ సర్పంచ్ అండ్ ఫ్యామిలీ
నాంపల్లి బజార్ ఘాట్ అపార్ట్మెంట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారికి యుద్ధ ప్రాతిపదికన మెరుగైన వైద్యం అందించాలి అని ఆయన కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి అని సీఎల్పీ నేత కోరారు. అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి.. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనను సందర్శించడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ను ఎంఐఎం కార్యకర్తలు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాను.. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచివి కాదని భట్టి విక్రమార్క హితవు పలికారు.