Vivo X300 Ultra: వివో తన ఫ్లాగ్‌షిప్ X సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన మోడల్‌గా భావిస్తున్న Vivo X300 Ultraను వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటనకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి.
Read Also: Vietnam Beer Prices: రూ.18కి బీరు… మందు బాబులకు పండగే.. ఎక్కడో తెలుసా?
Vivo X300 Ultra డిస్‌ప్లే & డిజైన్
* ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. Vivo X300 Ultraలో 6.82 అంగుళాల BOE ఫ్లాట్ LTPO డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఇది 2K రిజల్యూషన్ తో రాబోతుంది. సన్నని బెజెల్స్‌తో పాటు రైట్-ఆంగిల్ మెటల్ మిడ్ ఫ్రేమ్ డిజైన్ ఉండే ఛాన్స్ ఉంది. కాగా, డిజైన్ విషయానికి వస్తే, గత మోడల్ అయిన Vivo X200 Ultra తరహాలోనే పెద్ద, గుండ్రని సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ కనిపించనుంది. అలాగే, X200 Ultraలో ఉన్న ప్రత్యేక డెడికేటెడ్ కెమెరా బటన్ ఈ కొత్త మోడల్‌లో ఉండకపోవచ్చని
టాక్.
Read Also: Team India: గంభీర్‌ను కోచ్గా తొలగించేందుకు ప్లాన్.. బీసీసీఐ ఉపాధ్యక్షుడు షాకింగ్ ఆన్సర్!
Vivo X300 Ultraలో స్పెసిఫికేషన్స్:
* 120Hz రిఫ్రెష్ రేట్తో BOE డిస్‌ప్లే
* హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్ సపోర్ట్
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ (రెండు 200MP సెన్సర్లు + 50MP అల్ట్రా వైడ్ కెమెరా)
* శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్
* 7,000mAh బ్యాటరీ
* 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్
ఈ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే, Vivo X300 Ultra హైఎండ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుందని స్పష్టంగా తెలుస్తోంది. అధికారిక లాంచ్ తేదీ, ధరతో పాటు ఇతర వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.