Vivo T4 Pro: భారత మార్కెట్‌లో వీవో తాజాగా Vivo T4 Pro స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకత విషయానికి వస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లో భాగంగా 50MP Sony IMX882 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉండటం. ఈ కెమెరా 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ తో అత్యద్భుతమైన ఫోటోలను అందిస్తుంది. అలాగే 6,500mAh సిలికాన్–కార్బన్ బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌తో వచ్చేసింది. దీనికి 12GB వరకు LPDDR4x RAM, 256GB వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ కొత్త మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15 పై రన్ అవుతుంది. అంతేకాకుండా నాలుగేళ్లపాటు మెజర్ అప్‌డేట్లు, 6 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందుతాయని కంపెనీ హామీ ఇచ్చింది. డిజైన్ పరంగా ఈ ఫోన్ 7.53mm మందంతో, 192 గ్రాముల బరువుతో చాలా సన్నగా ఉంటుంది. అలాగే ఇందులో 16,470 sq.mm VC కూలింగ్ సిస్టమ్, IP68 మరియు IP69 రేటింగ్స్ తో ఇది నీటి, దుమ్ముల నుండి రక్షణగా నిలుస్తోంది.
Bigg Boss 9: బిగ్ బాస్ 9లోకి జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్?
వివో T4 Pro లో 6.77 అంగుళాల FHD+ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 5,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్నెస్, 1,500 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో గూగుల్ జెమినీ యాప్ ప్రీ–ఇన్‌స్టాల్డ్‌గా ఉండటం ఓ ప్రత్యేకత. అలాగే జెమినీ లైవ్ తోపాటు AI క్యాప్షన్స్, AI కాల్ అసిస్టెంట్, AI స్పామ్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు మొబైల్ ను మరింత మెరుగుపరుస్తాయి.
ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 2MP సెన్సార్ ఉంటాయి. ఇక సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో AI పోర్ట్రైట్, AI ఏరేజ్ 3.0, AI మ్యాజిక్ మూవ్, AI ఎక్సపాండర్, AI ఎన్హన్స్ వంటి ఆధునిక AI ఫీచర్లు కెమెరా అనుభవాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
Mirai : మిరాయ్ పోస్ట్ పోన్.. ఇన్ సైడ్ స్టోరీ
Vivo T4 Pro ధర విషయానికి వస్తే.. ప్రారంభ వేరియంట్ 8GB + 128GB ధర రూ.27,999 కాగా, 8GB + 256GB వెర్షన్ ధర రూ.29,999. ఇక అదే టాప్ వేరియంట్ 12GB + 256GB ధర రూ.31,999గా కంపెనీ నిర్ణయించింది. బ్లజ్ గోల్డ్, నిట్రో బ్లూ వంటి రెండు కలర్ వేరియంట్లలో ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 29 నుంచి వివో ఇండియా e-store, ఫ్లిప్ కార్ట్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక కంపెనీ ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో ఏకంగా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, EMI ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
