ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 9లో ఆసక్తికరమైన కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి, ఈ ఏడాది “అగ్నిపరీక్ష” పేరుతో ఒక స్పెషల్ షోను డిజైన్ చేసిన స్టార్ మా సంస్థ, అందులో నుంచి ఐదుగురిని బిగ్ బాస్ హౌస్ లోపలికి పంపబోతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బాగా వైరల్ అయిన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ స్రష్టి వర్మ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ కాబోతోంది.
Also Read:Mana Shankara Vara Prasad Garu : షాకింగ్ నాన్ థియేట్రికల్ రైట్స్
నిజానికి, ఆమె గత ఏడాది జానీ మాస్టర్‌పై చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఆ తర్వాత జానీ మాస్టర్ కొన్నాళ్లపాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనేది గమనార్హం. బిగ్ బాస్ హౌస్‌లోకి చాలామంది కంటెస్టెంట్లు వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రకరకాల ప్రచారాలు జరుగుతున్నప్పటికీ, ఫైనల్‌గా సెప్టెంబర్ 5వ తేదీన షో మొదలైనప్పుడు ఎవరెవరు వెళ్తారనేది స్టార్ మా చేతుల్లోనే ఉంది.