Oppo Find X9: ఇప్పటికే చైనా మరియు గ్లోబల్ మార్కెట్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న Oppo Find X9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు నేడు భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ కానున్నాయి. గ్లోబల్ వెర్షన్‌ల మాదిరిగానే భారత మార్కెట్‌లో కూడా సమానమైన ఫీచర్లతో Oppo Find X9, Find X9 Pro రానున్నాయని సమాచారం. ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో లభ్యతను ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలో ఈ ఫోన్లపై వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. నేడు (మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు సిరీస్ అధికారికంగా విడుదల కానుంది. Find X9 Pro మోడల్ సిల్క్ వైట్, టైటానియం చార్ కోల్ కలర్‌లలో లభించనుండగా Find X9 స్పేస్ బ్లాక్, టైటానియం గ్రే రంగుల్లో అందుబాటులోకి రానుంది.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Find X9 Pro 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 nits పీక్ బ్రైట్‌నెస్, 20:9 రేషియోతో పాటు Corning Gorilla Glass Victus 2 రక్షణతో రావొచ్చని అంచనా. Find X9 మోడల్ 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లే మరియు 120Hz ఫిక్స్డ్ రిఫ్రెష్ రేట్‌తో రానుంది. రెండు ఫోన్లు కూడా అత్యాధునిక 3nm MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌తో పనిచేయనున్నాయి. వీటిలో గరిష్టంగా 16GB LPDDR5x ర్యామ్, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ అందించబడనుంది. వేడిని తగ్గించేందుకు ‘అడ్వాన్స్డ్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టం’ కూడా ఇవ్వబడుతుందని భావిస్తున్నారు.
Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఐక్యరాజ్యసమితి..
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, Find X9 Pro 7,500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 80W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Find X9 మోడల్‌లో 7,025mAh బ్యాటరీ సామర్థ్యం ఉండనుంది. కెమెరా సెటప్ కూడా ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హ్యాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌తో వచ్చే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో Find X9 Pro 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 200MP టెలిఫోటో లెన్స్‌లను కలిగి ఉండనుంది. ఇక ధరల లిస్ట్ చూస్తే.. ఒక భారతీయ రిటైలర్ వెబ్‌సైట్‌లో పొరపాటున బయటపడిన లిస్టింగ్ ప్రకారం Find X9 Pro 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,09,999గా ఉండొచ్చని అంచనా. Find X9 మోడల్ విషయంలో 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,999గా ఉండొచ్చు. అయితే ఇవి అధికారిక ధరలు కావు, లాంచ్ ఈవెంట్‌లోనే నిజమైన ధరలు వెల్లడికానున్నాయి.