NASA: భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడిపై గత దశాబ్ధాలుగా పలు దేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇందులో అన్నింటి కన్నా ముందు అమెరికన్ స్పేస్ ఏజెన్సీ ‘నాసా’ ఉంది. అయితే ఇప్పుడు నాసా చంద్రుడిపై మైనింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. వచ్చే పదేళ్లలో చంద్రుడిపై మైనింగ్ ప్రారంభించాలని నాసా భావిస్తున్నట్లు గార్డియన్ తన నివేదికలో పేర్కొంది. 2023 నాటికి చంద్రుడి ఉపరితలాన్ని తవ్వాలని యోచిస్తోంది.
ఇప్పటికే నాసా తన ప్రతిష్టాత్మకమైన ఆర్టెమిస్ మిషన్ ద్వారా 2025 నాటికి చంద్రుడిపై మనుషులను పంపేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ వార్త వచ్చింది. చంద్రుడిపైకి మానవులను చివరిసారిగా నాసా 1972లో చివరిసారిగా అపోలో 17లో తన వ్యోమగాముల్ని పంపింది. ఆ తరువాత ఇప్పుడే ఆర్టిమిస్ ద్వారా వ్యోమగాముల్ని పంపబోతోంది. ఈ మిషన్ ద్వారా మొదటిసారిగా ఓ మహిళను చంద్రుడిపైకి తీసుకెళ్లబోతున్నారు. చంద్రుడి నేలకు పదార్థాలను సేకరించడంతో పాటు ప్రాసెసింగ్ ప్లంట్ ను ఏర్పాటు చేసే ప్లాన్ తో ఒక టెస్ట్ డ్రిల్ ను అంతరిక్షంలో పంపుతుంది.
Read Also: Tamil Nadu: గవర్నర్ సంచలన నిర్ణయం.. సీఎంకి చెప్పకుండానే క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు..
ప్రస్తుతం తాము చంద్రుడిపై వనరులను అర్థం చేసుకోవడానికి, అణ్వేషించడానికి ప్రయత్నిస్తున్నామని నాసా శాస్త్రవేత్త గెరాల్డ్ శాండర్స్ ను ఉటంకిస్తూ ది గార్డియన్ పేర్కొంది. వాణిజ్య రాకెట్ కంపెనీలు ఇంధనం లేదా ఆక్సిజన్ నింపుకునేందుకు చంద్రుడి ఉపరితలాన్ని మొదటగా వాడే అవకాశం ఉందని రాయిటర్స్ తెలిపింది. చంద్రుడిపై ఎందుకు మైనింగ్ చేయాలని భావిస్తుందో..‘‘లూనార్ గోల్డ్ రష్’’ ఎలా పనిచేస్తుందనే వివరాలను నాసా తన వెబ్సైట్ లో 2015లో ప్రచురించింది. నాసా చంద్రుడిపై నీరు, హీలియం, రేర్ ఎర్త్ మెటల్స్ కోసం అణ్వేషిస్తోంది.
నీటిని రాకెట్ ఇంధనంగా మార్చగలిగితే, న్యూక్లియర్ ఫ్యూజన్ వంటి శక్తి రంగం అభివృద్ధిలో హీలియం సహాయపడుతుందని నాసా తెలిపింది. చంద్రుడిపై కనిపించే అరుదైన లోహాలైన స్కాండియం, యట్రియం ఆధునిక ఎలక్ట్రానిక్స్ రంగానికి మరింతగా ఉపయోగపడుతాయి. ఈ రెండు మూలకాలు చంద్రుడి శిలల్లో అధిక సాంద్రతతో ఉన్నాయి. చంద్రుడిపై ప్రతిరోజూ దాని నుండి 1 మెట్రిక్ టన్ను త్రవ్విస్తే, చంద్రుని ద్రవ్యరాశిలో 1 శాతం తగ్గడానికి 220 మిలియన్ సంవత్సరాలు పడుతుందని నాసా తెలిపింది.