మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లకు మంచి డిమాండ్ ఉంది.. ఒక్కో ఫోన్ ఒక్కో అదిరిపోయే ఫీచర్స్ ను కలిగి ఉంటున్నాయి.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా పోల్డబుల్ మొబైల్స్ ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి.. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీ మోటోరోలా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. ఈ ఫోన్ బెండబుల్ ఫోన్.. ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది.. ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం…
మోటోరోలా ఈ బెండింగ్ ఫోన్ ను ఆవిష్కరించింది. తమ మాతృ సంస్థ లెనోవో టెక్ వరల్డ్ 2023లో అత్యాధునిక ప్రోటో టైప్ బెండింగ్ స్మార్ట్ ఫోన్ ను మోటోరోలా పరిచయం చేసింది.. ఈ బెండింగ్ ఫోన్లను రౌండ్ గా చుట్టేయవచ్చు. చేతికి వాచీ లేదా బ్రాస్లైట్ లాగా కూడా ఈ ఫోన్ ను ధరించవచ్చు.. ఈ ఫోన్ ను ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు.. 2016లో టెక్ వరల్డ్ ఈవెంట్ లోనే ఈ బెండింగ్ ఫోన్ ను సంస్థ పరిచయం చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ను త్వరలోనే మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు మోటో కంపెనీ సన్నాహాలు చేస్తుంది..
ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ అప్డేటెడ్ లో వస్తుంది.. ఫుల్ HD, పీవోఎల్ ఈడీ డిస్ ప్లే తో ఉంటు 6.9 అంగుళాల స్క్రీన్ తో మార్కెట్లోకి వస్తుందట. కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి స్క్రీన్ ను 4.6 అంగుళాల వరకు తగ్గించుకునే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుత మోడల్స్ కంటే కెమెరా, స్టోరేజ్, ర్యామ్, బ్యాటరీ ఈ ఫోన్లో చాలా బాగున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. కస్టమర్లకు తగ్గ విధంగా ఈ ఫోన్ రాబోతుందని అంచనా.. త్వరలోనే ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి..