స్మార్ట్ గాడ్జెట్స్ ట్రెండీగా మారాయి. స్మార్ట్ వాచ్ లను ఏజ్ తో సంబంధం లేకుండా యూజ్ చేస్తున్నారు. హెల్త్ ఫీచర్లు కలిగి ఉండడం, బడ్జెట్ ధరల్లోనే లభిస్తుండడంతో స్మా్ర్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తు్న్నారు. తాజాగా స్మా్ర్ట్ వాచ్ లవర్స్ కు మరో కొత్త వాచ్ అందుబాటులోకి వచ్చింది. లావా కంపెనీ లావా ప్రోవాచ్ X స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇది ఇన్ బిల్ట్ GPS, బ్లూటూత్ కనెక్టివిటీతో వచ్చింది. SpO2 పర్యవేక్షణ, హార్ట్ రేట్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నది.
Alsor Read:MP: అప్పుడే పుట్టిన ఆడబిడ్డ గొంతు కోసిన తల్లి.. అయిన బతికిన మృత్యుంజయురాలు..
Lava ProWatch X Smartwatch 1.43-అంగుళాల AMOLED డిస్ల్పేతో, అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వస్తుంది. ప్రోవాచ్ X ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది మెటల్, నైలాన్, సిలికాన్ స్ట్రాప్ వేరియంట్‌లతో ఒకే కాస్మిక్ గ్రే కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. భారత్ లో లావా ప్రోవాచ్ X ధర రూ. 4,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌వాచ్ ఫిబ్రవరి 21 నుంచి ఫ్లిప్‌కార్ట్ లో సేల్ ప్రారంభంకానున్నది.
Alsor Read:Hyderabad: ప్రియురాలి పేరెంట్స్ వేధింపులకు ప్రియుడు బలి..
ప్రోవాచ్ X స్పెసిఫికేషన్స్
ప్రోవాచ్ X కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో 1.43-అంగుళాల (466×466 పిక్సెల్స్) AMOLED స్క్రీన్, 500nits పీక్ బ్రైట్‌నెస్, 326ppi పిక్సెల్ డెన్సిటీ, 30Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఇది డ్యూయల్-కోర్ ATD3085C ప్రాసెసర్‌ను కలిగి ఉంది. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్ లను కలిగి ఉంది. ఇది ఇంటెలిజెంట్ ఎక్సర్‌సైజ్ రికగ్నిషన్ (IER) ఏరోబిక్ ట్రైనింగ్ ఎఫెక్ట్‌లను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అందించే మిగిలిన హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లలో బాడీ ఎనర్జీ మానిటరింగ్, VO2 మ్యాక్స్, HRV, పోస్ట్-వర్కౌట్ రికవరీ అనాలిసిస్, SpO2 మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ప్రోవాచ్ X 300mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది.