Cyber Crime: పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ నేరాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు దోచుకున్న గ్యాంగ్‌ను భీమవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని పలు ప్రాంతాలకు చెందిన ఐదుగురు సభ్యుల ఈ ముఠా, ఆధునిక సైబర్ ట్రిక్స్‌తో ప్రజలను మోసగిస్తూ భారీ మొత్తంలో డబ్బును దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇన్ స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సాప్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడుతూ అమాయకులను అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. వాట్సాప్ హ్యాకింగ్ కేసులు వేగంగా పెరుగుతున్న తరుణంలో హ్యాకింగ్ బారిన పడకుండా ఉండేందుకు సలహాలు సూచనలు జారీ చేసింది. వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? మొబైల్ హ్యాక్ అయ్యిందని అనుమానం వస్తే ఏం…
దీపావళి ఆఫర్లు అనగానే.. వావ్ అని నోరెళ్లబెడుతున్నారా !! దివాళి గిఫ్ట్స్, బోనస్, రివార్డ్ పాయింట్స్ అనగానే… వెనకాముందు ఆలోచించకుండా క్లిక్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త !! ఇప్పటికే దివాళి దొంగలు ఎంట్రీ ఇచ్చేశారు. దీపావళిని కూడా కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు సైబర్ క్రిమినల్స్. ఇప్పటికే రెండు రోజుల్లో ఏకంగా 400 మందిని మోసం చేశారు. సందర్భమేదైనా సరే… సైబర్ నేరగాళ్లు ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశ పెట్టినా.. కంపెనీలు ఆఫర్లు ప్రకటించినా.. పండగలు…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్‌లో ఉన్న…
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఒక చిన్న కాల్‌తో అమాయకుల బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఓ రిటైర్డ్ హెడ్మాస్టర్‌కు కాల్ చేసి ఏకంగా 93 లక్షలు కొట్టేశారు. ఆమె ఖాతా నుంచి 10 సార్లు డబ్బు డ్రా చేసుకున్నారు కేటుగాళ్లు. అంతా అయిపోయాక మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. డిజిటల్ అరెస్ట్.. సైబర్ క్రిమినల్స్‌కు ఇదో ఆయుధం. అమాయకులు, చదువు రాని వారు దొరికితే చాలు.. సైబర్ కేటుగాళ్లు ఈ…
ఢిల్లీ – దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు సైబర్ నేరాలను అడ్డుకుంటూనే మరోపక్క నేరస్థుల నుంచి రికవరీలు కూడా చేస్తున్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ జరిగింది. అయితే రికవరీ అయిన సొమ్మును బాధితులకు రీఫండ్ చేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సులభతరం చేసే అంశంపై కేంద్రం యోచిస్తోంది. అత్యంత ప్రాధాన్యత…
సైబర్ నేరగాళ్ల తోకలు కత్తిరిస్తున్నారు తెలంగాణ పోలీసులు. వాళ్లకి మ్యూల్ అకౌంట్లు సమకూర్చిన నేరగాళ్లను గుర్తించారు. మొత్తంగా ఆరుగురిపై కేసులు పెట్టిన పోలీసులు.. తాజాగా ఒకరిని ముంబై ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు. మొన్ననే 25 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. తాజాగా మరో ముఠా బాగోతాన్ని బయట పెట్టారు. సైబర్ క్రిమినల్స్‌కు బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న నేరగాళ్లను గుర్తించారు.. ఇటీవల హైదరాబాద్‌లో ఉంటున్న…
సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు ఉద్యోగులను, విద్యావంతులను కూడా బురిడికొట్టిస్తున్నారు. తాజాగా అనంతపురంలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్ల వలకి చిక్కాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. సీఐడీ అధికారి అంటూ బెదిరించి రూ. 1.04 కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఓబులదేవ నగర్ కి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి మహిళలను వేదిస్తున్నావని, మనీలాండరింగ్ కి పాల్పడ్డావని సైబర్ నేరగాడు కాల్ చేశాడు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరించారు. Also Read:Harihara Veeramallu :…
ఆ వ్యక్తి వయసుల 70 ఏళ్లు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. కృష్ణా రామా అనుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిన ఈ వయసులో దుర్భుద్ధి ప్రవేశపెట్టాడు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కి 38.73లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. హైదరాబాద్ కి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్‌లో ఇరికించి రూ. 38.73లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్ళు.
Cyber Fraud : సైబర్ నేరాలు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నిత్యం కొత్త రూపాల్లో మోసాలు చేస్తూ ప్రజలను దోచేస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇప్పుడు మరో స్థాయికి వెళ్లారు. తాజాగా సుప్రీం కోర్టు జడ్జి పేరు వినిపిస్తూ నకిలీ కోర్టు డ్రామాతో ఓ రిటైర్డ్ ఇంజనీర్‌ను మోసం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్‌కు ఓ వీడియో కాల్ వచ్చింది.…