ప్రస్తుతం ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తుంది.. ప్రతి సంస్థలో AI సేవలు నడుస్తున్నాయి.. మనిషి సృష్టించిన వాటిలో ఇవి ఒకటి.. రోబో సినిమాలో చెప్పినట్లు ఇవి మనుషులను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంటాయి.. అంతేకాదు మన ఉపాధికి కూడా గండి కొడుతాయా.. టెక్నాలజీ మనిషి చరిత్రను మార్చేస్తోందా..? రాబోయే రోజుల్లో అదే జరిగితే.. మనిషి ఏం చేయాలి.. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతున్న ఈ సమయంలో కొత్తరకమైన ఆందోళన మొదలైంది. అయితే, ఈ హ్యూమనాయిడ్ రోబోలు ముందుగా ఎవరి పనిని కొట్టేస్తాయి అనేదే ఇప్పుడు ప్రధాన చర్చ.. తాజా విశ్లేషనలు మాత్రం మహిళల ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వారి ప్లేసులో రానున్నాయని అంచనా వేశారు. ప్రస్తుతం అత్యంత హాటెస్ట్ టాపిక్ ఇదే..
గత కొద్ది రోజులుగా వీటిపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.. మునుషుల కన్నా వేగంగా పనులను పూర్తి చేస్తున్నాయి.. దాంతో అన్ని సంస్థలు వీటి వైపు మొగ్గు చూపిస్తున్నాయి.. ఏఐ గురించిన అతి పెద్ద భయం ఏంటంటే ఇది మానవ ఉద్యోగాలకు చోటు లేకుండా చేస్తుందని జనాలు భావిస్తున్నారు.. మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కృత్రిమ మేధస్సు (ఏఐ) పెరుగుదల పురుష ఉద్యోగుల కంటే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులను భర్తీ చేస్తుందని హెచ్చరించింది. ముఖ్యంగా సాంప్రదాయకంగా మహిళలు ఆధిపత్యం వహించే పరిశ్రమలలో ఇది కూడా ఒకటి అని రుజువైంది..
ఇప్పటికే వీటివల్ల చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకున్నారు.. 2030 నాటికి యూఎస్ జాబ్ మార్కెట్‌పై AI గణనీయమైన ప్రభావంపై ఆధారుపడుతుంది. ఏఐ ఆధారిత ఆటోమేషన్ భర్తీ చేయబడుతుందని అధ్యయనం సూచిస్తుంది . డేటా సేకరణ, పునరావృత పనులతో కూడిన ఉద్యోగాలు, 2030 నాటికి అమెరికాలో మాత్రమే సుమారు 12 మిలియన్ల వృత్తిపరమైన మార్పులకు దారితీస్తాయని హెచ్చరించింది.. ఒక్క ఈ రంగాలలో మహిళల సంఖ్యాపరమైన ఆధిపత్యం వల్ల మాత్రమే కాదు. వర్క్ ఫోర్స్‌లో మహిళల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. 21 శాతం మంది మహిళలు ఏఐ ఆటోమేషన్‌కు గురవుతున్నారని నివేదిక హైలైట్ చేస్తుంది. ఆఫీస్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ మరియు ఫుడ్ సర్వీస్ వంటి ఏఐ అంతరాయానికి అత్యంత హాని కలిగించే పరిశ్రమలు.. మహిళా ఉద్యోగుల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం.. అన్ని రంగాల్లో వీటి పై చర్చలు జరుగుతున్నాయి.. ముందు ముందు ఎలా ఉంటాయో చూడాలి..