Acerpure Nitro Z Series TV: ప్రసిద్ధ టెక్ బ్రాండ్ Acer గ్రూపులో భాగమైన Acerpure India తాజాగా భారత మార్కెట్లో కొత్త Nitro Z Series 100 అంగుళాల QLED టీవీను లాంచ్ చేసింది. ఈ టీవీ అధునాతన ఫీచర్లతో గేమర్స్, సినిమా ప్రియుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ Acerpure Nitro Z Series టీవీ 100 అంగుళాల QLED ప్యానెల్‌తో వస్తుంది. ఇది 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ ను అందిస్తుంది. దీని వల్ల గేమింగ్ లేదా యాక్షన్ సన్నివేశాల్లో స్మూత్, లాగ్‌లేని విజువల్ అనుభవం లభిస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR10, ఫిలిం మేకర్ మోడ్ లను సపోర్ట్ చేస్తుంది. అలాగే 400 nits బ్రైట్‌నెస్ తో రంగుల స్పష్టతను అందిస్తుంది. పనితీరు పరంగా ఈ మోడల్‌లో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. దీని ద్వారా అనేక యాప్‌లను సులభంగా రన్ చేయవచ్చు. గేమర్ల కోసం ALLM (Auto Low Latency Mode), VRR (Variable Refresh Rate), MEMC టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి లాగ్, మోషన్ బ్లర్‌ను తగ్గించి, గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ఇక ఆడియో పరంగా ఈ టీవీ 60W స్పీకర్లతో వస్తుంది. అదనంగా డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ ఉండటంతో, థియేటర్ స్థాయి సౌండ్ అనుభవాన్ని అందిస్తుంది. స్మార్ట్ ఫీచర్ల పరంగా చూస్తే Nitro Z Series టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. దీని ద్వారా యూజర్లు తమకు నచ్చిన యాప్‌లు, కంటెంట్ రికమెండేషన్లు, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ వంటి సౌకర్యాలను పొందగలరు. అలాగే కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇది డ్యుయల్ వై-ఫై సపోర్ట్‌తో పాటు HDMI, USB పోర్టులు కలిగి ఉంటుంది. ఇంకా సింగిల్ రిమోట్ కంట్రోల్ ద్వారా అనేక డివైస్‌లను సులభంగా నిర్వహించవచ్చు. Acerpure Nitro Z Series 100 అంగుళాల QLED TV ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభిస్తోంది. దీని ప్రారంభ ధర రూ.2,59,999గా నిర్ణయించారు. ఈ టీవీతో Acerpure సంస్థ భారతీయ మార్కెట్లో ప్రీమియం QLED సెగ్మెంట్‌లో పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.
Tele MANAS: వినూత్నంగా ‘టెలీ మానస్’పై అవగాహన.. చిన్నారిని అభినందించిన మంత్రి