MAX2: యాక్షన్ కెమెరా దిగ్గజ సంస్థ GoPro భారత్‌లో తన తాజా ఉత్పత్తులైన MAX2, LIT HERO, Fluid Pro AIలను అధికారికంగా విడుదల చేసింది. ఈ మూడు ప్రోడక్ట్స్ 2025 సెప్టెంబర్‌లో అంతర్జాతీయంగా లాంచ్ కాగా.. ఇప్పుడు ఇవి భారత మార్కెట్లో వీటిని కంటెంట్ మేకర్లు, అడ్వెంచర్ ప్రేమికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మూడు కొత్త GoPro ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్లలో లభించనున్నాయి. మరి వీటి వివరాలను చూసేద్దామా..
MAX2 (ప్రొఫెషనల్ 8K 360 కెమెరా):
GoPro MAX2 అనేది ప్రొఫెషనల్ 360° కెమెరా. ఇది True 8K వీడియో రికార్డింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర మోడల్స్ కంటే ఎక్కువ రిజల్యూషన్ అందిస్తుంది. అధునాతన కలర్ క్యాప్చర్, ప్రొఫెషనల్ ఆడియో, AI ఆధారిత ఎడిటింగ్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో ఇది యాక్షన్, అవుట్‌డోర్, 360° కంటెంట్ క్రియేషన్‌కు సరిపోతుంది.
ప్రధాన ఫీచర్లు:
* 10-Bit Full-Range Color సపోర్ట్ (GP Logతో 1 బిలియన్ కలర్స్ వరకు).
* 29MP 360° ఫోటోలు, 8K30fps వీడియో రికార్డింగ్.
* Twist-and-Go లెన్స్ రీప్లేస్‌మెంట్ సిస్టమ్.
* ఆరు మైక్రోఫోన్లు, 360° ఆడియో సపోర్ట్.
* AI ఎడిటింగ్, Wi-Fi 6, Bluetooth 5.3, GPS సపోర్ట్.
* 5 మీటర్ల వరకు వాటర్‌ప్రూఫ్, Enduro 1960mAh బ్యాటరీ.
* ధర: రూ. 54,999 (లాంచ్ బండిల్‌లో 64GB SD కార్డ్ ఉచితం).
#GoProMAX2 is here 🚨 Industry-leading, true 8K 360 video delivers 21% more resolution than the competition, resulting in unmatched image quality that you only get from #GoPro.
✔️ Emmy® Award-Winning 360 technology
✔️ The only true 8K 360 camera. No misleading upscaling, no… pic.twitter.com/elwuBFABUb— GoPro (@GoPro) September 23, 2025
LIT HERO (లైటింగ్‌తో కూడిన లైఫ్‌స్టైల్ కెమెరా):
LIT HERO చిన్నదైన, తేలికైన లైఫ్‌స్టైల్ కెమెరా. ఇది బిల్ట్ ఇన్ లైట్ సపోర్ట్‌తో వస్తుంది. కేవలం 93 గ్రాములు బరువుతో ఉన్న ఈ కెమెరా 4K వీడియోలను 60fps వద్ద రికార్డ్ చేస్తుంది. 2x స్లో మోషన్, మాగ్నెటిక్ మౌంటింగ్, రెట్రో స్టైల్ షూటింగ్ మోడ్‌లు దీని ప్రత్యేకతలు.
ప్రధాన ఫీచర్లు:
* 12MP ఫోటోలు, 4K వీడియో (4:3, 16:9 రేషియోలు).
* IP68 వాటర్‌ప్రూఫ్ (16ft వరకు).
* 1255mAh Enduro బ్యాటరీ, 100 నిమిషాల కంటిన్యూస్ షూటింగ్.
* Wi-Fi 5, Bluetooth 5.2, ఆటో క్లౌడ్ అప్‌లోడ్.
* వాయిస్ కంట్రోల్ (8 కమాండ్లు).
* ధర: రూ. 28,500 (డిసెంబర్ 2025 మొదటి వారం నుంచి అందుబాటులో).
Fluid Pro AI (స్మార్ట్ మల్టీ కెమెరా గింబల్):
Fluid Pro AI అనేది 3-యాక్సిస్ AI గింబల్. ఇది GoPro కెమెరాలు, స్మార్ట్‌ఫోన్లు, 400 గ్రాముల వరకు ఉన్న చిన్న కెమెరాలు కోసం రూపొందించబడింది. ఇది AI ఆధారిత సబ్జెక్ట్ ట్రాకింగ్ ఫీచర్‌తో వ్యక్తుల ముఖాలు లేదా శరీరాలను ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఫిల్ లైట్, 18 గంటల బ్యాటరీ లైఫ్ కూడా కలిగి ఉంది.
ప్రధాన ఫీచర్లు:
* 3-Axis స్టెబిలైజేషన్, 360° పాన్ రొటేషన్.
* AI ట్రాకింగ్ (ముఖం/శరీరం ఫాలో).
* ఇంటిగ్రేటెడ్ లైట్, ఫోన్/GoPro షట్టర్ కంట్రోల్.
* USB పవర్ అవుట్, పవర్ బ్యాంక్‌గా ఉపయోగించవచ్చు.
* GoPro Fluid యాప్ సపోర్ట్, లైఫ్‌టైమ్ వారంటీ.
* ధర: రూ. 23,000 (జనవరి 2026 ప్రారంభంలో లభ్యం).