Swiggy: భారత ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ప్లాట్‌ఫారమ్ ఫీజును 17% పెంచి రూ.14 గా నిర్ణయించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తోందని సమాచారం. ఈ పెంపు తాత్కాలికం మాత్రమేనని, పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కారణంగా తీసుకున్న చర్య అని సంస్థ తెలిపింది. Pakistan Helicopter Crash: పాక్‌లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్ 2023లో మొదట ఈ…
Ownly: బైక్ టాక్సీలకు ప్రసిద్ధి చెందిన భారతీయ రైడ్ హైలింగ్ కంపెనీ ర్యాపిడోఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలో అడుగుపెట్టింది. ఓన్లీ (Ownly) అనే కొత్త సర్వీస్‌ను బెంగళూరులో పరీక్షాత్మకంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. ఇది బెంగళూరులోని బైరసంద్ర, తవరేకెరే, మడివాల (BTM లేఅవుట్), హుసూర్ సర్జాపుర రోడ్ (HSR లేఅవుట్), కొరమంగల వంటి కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‌ను ర్యాపిడో యొక్క పూర్తి యాజమాన్యంలోని సబ్‌సిడియరీ Ctrlx Technologies ద్వారా…
ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు
Zomato, Swiggy: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్స్ అయిన స్విగ్గీ, జొమాటోలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. వర్షాకాలం కోసం కొత్త నియమాలను తీసుకువచ్చాయి. ఇకపై వర్షం సమయంలో, బ్యాడ్ వెదర్ ఉన్న సమయంలో ఫుడ్ డెలివరీ చేయాలంటే వినియోగదారుదు అదనంగా ఛార్జీలు చెల్లించాల్సిందే. సాధారణ యూజర్లతో సహా, సబ్‌స్క్రిప్షన్ కలిగిన వినియోగదారులను కూడా ఇకపై ఒకే విధంగా ట్రీట్ చేయనున్నాయి.
Zomato: రెండేళ్ల క్రితం మొదలైన టెక్ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇంటర్నేషనల్ టెక్ కంపెనీల దగ్గర నుంచి దేశీయ కంపెనీల వరకు ఉద్యోగుల్ని ఎలా వదిలించుకోవాలా..? అని చూస్తున్నాయి. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉద్యోగుల్ని మరింత ప్రమాదంలోకి నెట్టింది. గత రెండేళ్లుగా గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.
Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో…
Rapido: ఫుడ్ డెలివరీ రంగం రోజురోజుకు విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇష్టమైన ఆహార పదార్థాలను కేవలం కొన్ని నిమిషాల్లోనే ఇంటికి చేరవేయడం ద్వారా ఈ సేవలు ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ప్రస్తుతానికి, ఈ రంగంలో ప్రముఖ సంస్థలు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే, ఇప్పుడు మరో ప్రధాన ఆటగాడు ఈ రంగంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. క్యాబ్ బుకింగ్ సేవల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ర్యాపిడో (Rapido) కూడా…
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేరు మారుతుంది. కంపెనీ బోర్డు పేరు మార్పును ఆమోదించింది. కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ వాటాదారులకు రాసిన లేఖలో ఈ సమాచారాన్ని అందించారు. అయితే, జొమాటో బ్రాండ్ పేరులో ఎటువంటి మార్పు ఉండదు. యాప్‌లో కూడా జొమాటోగానే ఉంటుంది. కంపెనీ పేరు మాత్రమే మార్చనున్నారు. జొమాటో లిమిటెడ్ కంపెనీ కాస్త ఇప్పుడు ఎటర్నల్ లిమిటెడ్ గా మారనుంది.
Swiggy: లంచ్ టైమ్ అయ్యిందా.. గబుక్కున గుర్తొచ్చేవి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చాలా మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వంట చేసుకోవడానికి టైమ్ లేదనుకుంటే.. ఇప్పుడు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా మారిపోయింది హ్యూమన్ లైఫ్ స్టైల్. దొరికిన కాసింత టైమ్ లో గబగబా తినేస్తూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చాయి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో ఆహార ప్రియులకు కోరుకున్న ఆహారాన్ని…
Zomato: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘‘జొమాటో’’ డెలివరీ ఏజెంట్ క్రిస్మస్ దుస్తులను ధరించి ఆర్డర్లను ఇవ్వడంపై హిందూ గ్రూప్ ప్రశ్నల్ని లేవనెత్తింది. శాంటాక్లాజ్ దుస్తుల్లో డెలివరీ ఏజెంట్‌ని నిలదీయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూయేతర పండగల్లో మాత్రమే ఇలాంటి విధానాలు అవలంభిస్తుందని జొమాటోపై హిందూ గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.