Swiggy: భారత ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ అండ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొన్ని ప్రాంతాల్లో ప్లాట్‌ఫారమ్ ఫీజును 17% పెంచి రూ.14 గా నిర్ణయించింది. అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం అమలు చేస్తోందని సమాచారం. ఈ పెంపు తాత్కాలికం మాత్రమేనని, పండుగ సీజన్‌లో పెరిగిన డిమాండ్ కారణంగా తీసుకున్న చర్య అని సంస్థ తెలిపింది.
Pakistan Helicopter Crash: పాక్‌లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
2023లో మొదట ఈ ఫీజు కేవలం రూ.2 మాత్రమే ఉండగా, ఇప్పుడు అది 600% పెరిగింది. మరోవైపు, జొమాటో మాత్రం తన ప్లాట్‌ఫారమ్ ఫీజును రూ.10 వద్ద స్థిరంగా ఉంచింది. 2024 చివరి నుండి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో ప్లాట్‌ఫారమ్ లేదా హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9 నుంచి 15 వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1 నుండి 3 శాతం వరకూ ఉంటుంది. ఈ ఫీజులు వినియోగదారుడు ప్రాంతాన్ని బట్టి మారుతాయి.
Imtiaz Jaleel: మాంసం దుకాణాల మూసివేతపై ‘బిర్యానీ పార్టీ’తో AIMIM నేత నిరసన!
ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థలు అధిక ప్లాట్‌ఫారమ్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని కొని నివేదికలు పేర్కొన్నాయి. ఫుడ్ డెలివరీ రంగంలో ప్రధానంగా జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటివి మాత్రమే కావడంతో హ్యాండ్లింగ్, కన్వీనియెన్స్, స్మాల్ ఆర్డర్ ఫీజులు సాధారణమవుతున్నాయి. ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా, పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో కస్టమర్లను ఆకర్షించడానికి భారీగా ఖర్చు చేసిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాలను పెంచుకోవడానికి ఫీజుల పెంపుపై దృష్టి పెట్టాయి.