ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గి టైమ్స్ ఇంటర్నెట్-బ్యాక్డ్ డైనింగ్ అవుట్ ప్లాట్‌ఫారమ్ డైనౌట్‌ను దాదాపు 200 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని విశ్వసనీయ వర్గాలు సోమవారం ఇక్కడ తెలిపాయి. డైనౌట్ ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ క్రెడ్‌తో కూడా చర్చలు జరుపుతోంది, అయితే స్విగ్గీ స్పష్టంగా రేసును గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే స్విగ్గీ-డైనౌట్ ప్రతినిధులు చర్చలు ఇప్పుడు 200 మిలియన్ డాలర్ల పరిధిలో (Dineout యొక్క ప్రస్తుత విలువ ప్రకారం) కొనుగోలు కోసం…
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పెద్దలు చెప్పిన సామెత. ప్రస్తుతం అదే పనిని సినీ తారలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అవకాశాలు ఉన్నప్పుడే రెండు చేతులా సంపాదించి నాలుగు రాళ్లు వేనేకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నది సూపర్ స్టార్ మహేష్ బాబు. పలు కంపెనీలకు మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.…
కొత్త సంవత్సరం వేళ ఫుడ్ డెలివరీ యాప్‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. సరికొత్త రికార్డుసు సృష్టించాయి. దేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్‌లైన స్విగ్గి, జోమాటోలు సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాయి. డిసెంబర్ 31 వ తేదీన స్విగ్గిలో ప్రతి నిమిషానికి 9 వేల ఆర్డర్లు బుక్ చేయగా, జొమాటోలో నిమిషానికి 8 వేల ఆర్డర్లు వచ్చినట్టు పేర్కొన్నది. గతేడాది డిసెంబర్ 31 వ స్విగ్గిలో నిమిషానికి 5,500 ఆర్డర్లు రాగా, ఆ రికార్డును స్విగ్గి ఈ…
ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ నుంచి పక్కకు తప్పుకున్నది. కరోనా నుంచి కోలుకుంటుండటంతో ఫుడ్ డెలివరీకి డిమాండ్ పెరుగుతున్నది. నిత్యవసర వస్తువుల డోర్ డెలివరీ కంటే, ఫుడ్ డెలివరీకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో నిత్యవసర సేవల డోర్ డెలివరీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. గతేడాది ఓసారి ఈ నిర్ణయం తీసుకోగా, జులై నెలలో ఈ సేవలను తిరిగి ప్రారంభించింది. అయితే,…