West Indies Have Less Chances to Qualify ODI World Cup 2023: ప్రపంచకప్ 2023 ‘సూపర్ సిక్స్’ దశ గురువారం ఆరంభం కాగా.. జింబాబ్వే అదరగొట్టింది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్ సిక్స్ దశలో ఆరు పాయింట్లతో జింబాబ్వే టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. ఒమన్‌పై జింబాబ్వే గెలవడంతో వెస్టిండీస్ ప్రపంచకప్ ఆశలు సన్నగిలాయి. రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉన్న విండీస్.. మెగా టోర్నీకి అర్హత సాదించకుండానే ఇంటిదారి పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రపంచకప్ 2023 లీగ్ దశలో గ్రూప్ ఎలో ఉన్న నెదర్లాండ్స్, వెస్టిండీస్, నేపాల్, అమెరికా జట్లపై జింబాబ్వే గెలిచింది. జింబాబ్వే సహా నెదర్లాండ్స్, వెస్టిండీస్ జట్లు కూడా ‘సూపర్ సిక్స్’ దశకు చేరుకున్నాయి. జింబాబ్వే సూపర్ సిక్స్ పోటీలను విజయంతో మొదలుపెట్టింది. ఒమన్‌పై నెగ్గి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. జింబాబ్వే రన్‌రేట్ కూడా (0.75) మెరుగ్గానే ఉంది. రన్‌రేట్ తక్కువగా ఉన్న వెస్టిండీస్ (–0.35) ప్రపంచకప్ 2023కు అర్హత సాధించే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాలంటే.. విండీస్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించాలి. సూపర్ సిక్స్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ప్రపంచకప్ బెర్త్‌లు దక్కుతాయి.
ప్రపంచకప్ 2023 రెండు బెర్త్‌ల కోసం వెస్టిండీస్, శ్రీలంక పోటీపడతాయని అందరూ భావించారు. అయితే అద్భుత ఆటతో అనూహ్యంగా జింబాబ్వే రేసులో ముందుకు వచ్చింది. జింబాబ్వే ప్రపంచకప్ బెర్త్ దాదాపుగా ఖాయం అయినట్టే. శ్రీలంక పరిస్థితి బాగానే ఉన్నా.. రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉన్న విండీస్ ఆశలు వదులుకోకతప్పని దుస్థితి నెలకొంది. విండీస్ ఒక్క మ్యాచ్ ఓడినా ప్రపంచకప్ 2023 ఆశలు గల్లంతు అవుతాయి. సూపర్‌సిక్స్‌లో భాగంగా విండీస్ శనివారం తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. స్కాట్లాండ్‌తో విండీస్ అమితుమీ తేల్చుకోనుంది.
Also Read: New BCCI Chief Selector: ఢిల్లీ క్యాపిటల్స్ పదవికి రాజీనామా.. టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్!
Also Read: Poonam Pandey: వర్షంలో తడుస్తూ.. బీచ్‌లో హాట్ పోజులు..అదిరిందమ్మ పూనమ్