Zimbabwe beat Pakistan Highest Score in ODI: ఐసీసీ ఒన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ 2023లో జింబాబ్వే భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో అమెరికాను ఏకంగా 304 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయింది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో ఓటమెరుగని జింబాబ్వే.. తాజాగా అమెరికాకు చుక్కలు చూపించింది.
జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 408 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ సీన్ విలియమ్స్(174; 101 బంతుల్లో 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ సెంచరీ చేయగా.. ఓపెనర్ జోయ్‌లార్డ్ గుంబీ (78; 103 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచరీబాదాడు. సికిందర్ రాజా (48; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ బర్ల్ (47; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. జింబాబ్వే బ్యాటర్ల ధాటికి అమెరికా బౌలర్లు పోటాపడి మరీ పరుగులు సమర్పించుకున్నారు. అమెరికా బౌలర్లలో అభిషేక్ పరాద్కర్ మూడు వికెట్లు తీయగా.. జెస్సీ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read: ICC World Cup 2023: నింగి నుంచి నరేంద్ర మోదీ స్టేడియంలో దిగిన వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ!
409 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 104 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే బౌలర్ల దాటికి 25.1 ఓవర్లకే చాపచుట్టేసింది. యూఎస్‌ఏ బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ సాధించారు. దీంతో జింబాబ్వే 304 పరుగులతో రికార్డు విజయం అందుకుంది. తద్వారా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా భారత్ తర్వాతి స్థానంలో నిలిచింది.
వన్డే క్రికెట్‌లో జింబాబ్వే నమోదైన చేసిన అత్యధిక స్కోరు (408) ఇదే. వన్డే క్రికెట్‌లో 400కు పైగా పరుగులు చేసిన 7వ జట్టుగా జింబాబ్వే నిలిచింది. ఈ రికార్డు వన్డే అగ్ర జట్టు పాకిస్థాన్ కూడా అందుకోలేదు. క్రికెట్‌లో మొత్తం 953 మ్యాచ్‌లు ఆడిన పాకిస్థాన్.. ఇప్పటివరకు 400 పరుగుల మార్క్ కూడా అందుకోలేదు. గతంలో జింబాబ్వేపై పాకిస్థాన్ చేసిన 399 పరుగులే అత్యధిక స్కోరు. పాక్ చేసిన 399 పరుగుల రికార్డును జింబాబ్వే అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.
Also Read: Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!